Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. రేపటి నుంచే ఆ సమస్యకు చెక్‌.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను..

TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. రేపటి నుంచే ఆ సమస్యకు చెక్‌.
TSRTC
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2023 | 3:40 PM

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహా లక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు తెలంగాణ వ్యాప్తగా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి విశేష స్పందన లభిస్తుండడంతో బస్సుల కొరత ఏర్పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

వీటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది.

అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి ప్రారంభించనున్నారు. వీటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులున్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు జరుగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..