AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentines Day 2026: ఈ గిఫ్ట్స్ ఇస్తే మీ ఫార్ట్నర్ ఫిదా! బడ్జెట్‌లో దొరికే బెస్ట్ వాలెంటైన్స్ డే డీల్స్ ఇవి..

వాలెంటైన్స్ డే అంటే కేవలం గులాబీ పువ్వులు, చాక్లెట్లు మాత్రమే కాదు.. నేటి టెక్నాలజీ యుగంలో మీ ప్రేమను చాటిచెప్పడానికి స్మార్ట్ గ్యాడ్జెట్లు కూడా బెస్ట్ ఆప్షన్. మీ పార్టనర్ దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేసే, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించే టెక్ గిఫ్ట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఆపిల్, శామ్సంగ్, అమెజాన్ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి టాప్ 10 టెక్ గిఫ్ట్ ఐడియాలు ఇవి...

Valentines Day 2026: ఈ గిఫ్ట్స్ ఇస్తే మీ ఫార్ట్నర్ ఫిదా! బడ్జెట్‌లో దొరికే బెస్ట్ వాలెంటైన్స్ డే డీల్స్ ఇవి..
Valentines Day Tech Gifts 2026
Bhavani
|

Updated on: Feb 12, 2026 | 11:39 AM

Share

ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఏం గిఫ్టివ్వాలో తెలియట్లేదా?.. అయితే ఇక్కడ మీకు ఉపయోగపడే స్మార్ట్ రింగ్స్, కాఫీ మెషిన్లు, ప్రొజెక్టర్లు స్మార్ట్ ట్రాకర్ల వంటి 10 అద్భుతమైన గ్యాడ్జెట్ల లిస్ట్ ఉంది. ఇవి కేవలం విలాసవంతమైనవి మాత్రమే కాదు, నిత్యం ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టెక్ గిఫ్ట్స్ తో ప్రేమే కాదు మీ పార్ట్నర్ ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని చెప్పకనే చెప్పేయండి..

1. శామ్సంగ్ గెలాక్సీ రింగ్

ఆరోగ్యంపై శ్రద్ధ చూపే భాగస్వామికి ఇది అద్భుతమైన బహుమతి. ఇది నిద్ర, హృదయ స్పందన రేటు రోజువారీ కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు బ్యాటరీ వస్తుంది. దీనికి ఎటువంటి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.

2. ఆపిల్ ఎయిర్ ట్యాగ్ 2

వస్తువులను ఎక్కడో ఒకచోట మర్చిపోయే అలవాటున్న వారికి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. కీస్, బ్యాగులు లేదా వాలెట్‌లకు దీనిని తగిలించుకుంటే, ఐఫోన్ ద్వారా వాటి ఖచ్చితమైన లొకేషన్‌ను సెకన్లలో కనిపెట్టేయొచ్చు. కొత్త మోడల్‌లో రేంజ్ కూడా పెరిగింది.

3. హైబ్రూ H10A కాఫీ మెషిన్

కాఫీ ప్రియుల కోసం ఇది ఒక వరం. ఇంట్లోనే కేఫ్ తరహా ఎస్ప్రెసో, లాట్టేలను తయారు చేసుకోవచ్చు. ఇందులో టెంపరేచర్ కంట్రోల్ మిల్క్ ఫ్రోథింగ్ వంటి ప్రొఫెషనల్ ఫీచర్లు ఉన్నాయి.

4. అమెజాన్ కిండిల్

పుస్తకాలు చదవడం ఇష్టపడే వారికి కిండిల్ కంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదు. దీని గ్లేర్-ఫ్రీ స్క్రీన్ వల్ల కళ్లకు అలసట కలగదు. వేల సంఖ్యలో ఈ-బుక్స్‌ను ఇందులో దాచుకోవచ్చు.

5. డ్రీమ్ గ్లోరీ హెయిర్ డ్రైయర్

ఇది కేవలం హెయిర్ డ్రైయర్ మాత్రమే కాదు, జుట్టును సురక్షితంగా ఆరబెట్టే టెక్నాలజీ. నెగటివ్ అయాన్ టెక్నాలజీతో జుట్టు చిక్కుపడకుండా, నిగనిగలాడేలా చేస్తుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది.

6. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K

సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇష్టపడే జంటలకు ఇది సరైన ఎంపిక. సాధారణ టీవీని కూడా స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది. 4K క్వాలిటీతో అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

7. ఎప్సన్ హోమ్ ప్రొజెక్టర్

ఇంటినే సినిమా థియేటర్‌గా మార్చుకోవాలనుకుంటే ఈ ప్రొజెక్టర్ బెస్ట్. బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూస్తూ క్వాలిటీ టైమ్ గడపవచ్చు.

8. న్యూక్ క్రష్ బ్లెండర్

ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం ఈ స్మూతీ బ్లెండర్ చాలా బాగుంటుంది. ప్రోటీన్ షేక్స్, ఫ్రూట్ స్మూతీలను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీని క్లీనింగ్ కూడా చాలా సులభం.

9. ఓరల్-బి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్

ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే బహుమతి ఇది. సాధారణ బ్రష్ కంటే మెరుగైన క్లీనింగ్‌ను ఇది అందిస్తుంది. ఇందులో ఉండే టైమర్ ఫీచర్ సరైన సమయం పాటు బ్రష్ చేసేలా చేస్తుంది.

10. స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడ్

మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటే, శామ్సంగ్ గెలాక్సీ లేదా ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ ఇవ్వడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? అద్భుతమైన కెమెరాలు, పెర్ఫార్మెన్స్‌తో ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతులు.