Revanth Reddy: కేబీసీలో రేవంత్ రెడ్డి గురించి ప్రశ్న.. లైఫ్‌ లైన్ తీసుకున్న కంటెస్టెంట్

అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా నిర్వహిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ప్రశ్న అడిగారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న ప్రశ్నకు యువతి సమాధానం చెప్పలేకపోయారు. దీంతో లైఫ్‌లైన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది తెలంగాణ అని సూచించారు.

Revanth Reddy: కేబీసీలో రేవంత్ రెడ్డి గురించి ప్రశ్న.. లైఫ్‌ లైన్ తీసుకున్న కంటెస్టెంట్
Amitabh Bachchan
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 29, 2023 | 4:02 PM

కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోకి ఇండియాలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి విస్తరించింది. ఇందులో పాల్గొన్న సామాన్యులు కోటీశ్వరులయ్యారు. ఈ షో హిందీలో ప్రారంభమై 24 ఏళ్లు అయినా  ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ప్రజెంట్‌ 15వ సీజన్‌ నడుస్తోంది. కాగా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వడానికి కౌన్ బనేగా కరోడ్పతి (కెబిసి) కంటెస్టెంట్ ఇటీవల లైఫ్‌లైన్‌ను ఉపయోగించారు.  ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో రూ.40 వేల ప్రశ్నగా రేవంత్‌ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని పార్టిసిపెంట్‌ను హోస్ట్‌ అమితాబ్‌ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఆంధప్రదేశ్‌ అని ఆప్షన్స్ ఇచ్చారు.

అయితే సదరు కంటెస్టెంట్ సమాధానం చెప్పలేక.. కన్‌ఫ్యూజ్ అయ్యింది. దీంతో లైఫ్‌లైన్‌ ఆప్షన్ తీసుకుంది. పోల్ తర్వాత, 80 శాతం మంది ప్రేక్షకులు “తెలంగాణ” అని..  11 శాతం మంది “ఛత్తీస్‌గఢ్” అని ఎంచుకున్నారు.  మిగిలిన వారు C, D ఆప్షన్స్ ఎంచుకున్నారు.  తెలంగాణ లాక్ చేసేందుకు ఆమె అంగీకరించారు.  అది కరెక్ట్ ఆన్సర్ అవ్వడంతో తదుపరి ప్రశ్నకు అర్హత సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిందని.. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని ఈ సందర్భంగా అమితాబ్ వ్యాఖ్యానించారు.

వీడియో చూడండి

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో, తెలంగాణలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరిచింది, పార్టీ విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రంగా అవతరించింది. విజయంలో కీలక భూమిక పోషించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా KBC కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యి.. ఆడియెన్స్ పోల్‌ సాయంతో ముందుకు వెళ్లగలిగారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త మార్గాల్లో సైబర్‌ నేరాలు.. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930కే ఎసరు!
కొత్త మార్గాల్లో సైబర్‌ నేరాలు.. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930కే ఎసరు!
టాలీవుడ్‌ మీద ఫోకస్ చేస్తున్న కన్నడ స్టార్‌
టాలీవుడ్‌ మీద ఫోకస్ చేస్తున్న కన్నడ స్టార్‌
గెట్ రెడీ ముంబై.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు..
గెట్ రెడీ ముంబై.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు..
ట్రాఫిక్ పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్.. షాకింగ్‌ వీడియో
ట్రాఫిక్ పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్.. షాకింగ్‌ వీడియో
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్..
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్..
జమ్మూ కాశ్మీర్ భూకంపం.. 5.8 తీవ్రతతో.. భయాందోళన చెందిన జనం
జమ్మూ కాశ్మీర్ భూకంపం.. 5.8 తీవ్రతతో.. భయాందోళన చెందిన జనం
మూడు రోజులుగా చెరువులో ఇరుక్కుపోయిన శునకం.. ఎలా కాపాడారో చూడండి
మూడు రోజులుగా చెరువులో ఇరుక్కుపోయిన శునకం.. ఎలా కాపాడారో చూడండి
విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ ఆమెనే..
విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ ఆమెనే..
వార్నీ ఇదెక్కడి వింతరా సామీ..!20ఏళ్లుగా ఈ వస్తువు అతడి ముక్కులోనే
వార్నీ ఇదెక్కడి వింతరా సామీ..!20ఏళ్లుగా ఈ వస్తువు అతడి ముక్కులోనే
పర్ఫెక్ట్ స్క్రిప్టులతో దూసుకెళ్తున్న టాలెంటెడ్‌ డైరెక్టర్లు
పర్ఫెక్ట్ స్క్రిప్టులతో దూసుకెళ్తున్న టాలెంటెడ్‌ డైరెక్టర్లు