AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annapoorani OTT: ఓటీటీలోకి వచ్చేసిన నయన తార కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

హిందూ, బ్రాహ్మణ సంఘలు నయన తార మూవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాలోని కొన్ని సన్ని వేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. చాలా చోట్ల నయన్‌ మూవీని నిషేధం విధించాలంటూ నిరసనలు కూడా జరిగాయి. ఇలా వివాదాలతో వార్తల్లో నిలిచిన..

Annapoorani OTT: ఓటీటీలోకి వచ్చేసిన నయన తార కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Annapoorani Movie
Basha Shek
|

Updated on: Dec 29, 2023 | 3:04 PM

Share

‘జవాన్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన చిత్రం అన్నపూరణి. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్ అనేది మూవీ క్యాప్షన్‌. నీలేశ్‌ కృష్ణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాలో జర్నీ ఫేమ్‌ జై, సత్యరాజ్‌, అచ్యుత్‌ కుమార్‌, కేఎస్‌ రవి కుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లే, రేణుకు, కార్తీక్‌ కుమార్‌, పూర్ణిమా రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నయన తార కెరీర్‌లో 75వ సినిమా కావడంతో రిలీజుకు ముందు అన్నపూరణి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే డిసెంబర్‌ 1 న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీనికి తోడు సరిగ్గా అన్నపూరణి మూవీ రిలీజ్‌ సమయంలోనే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో నయనతార మూవీ జనాలకు పెద్దగా రీచ్‌ కాలేకపోయింది. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. సినిమా రిజల్ట్‌ సంగతి పక్కన పెడితే అన్నపూరణి సినిమాపై పలు వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా హిందూ, బ్రాహ్మణ సంఘలు నయన తార మూవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాలోని కొన్ని సన్ని వేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. చాలా చోట్ల నయన్‌ మూవీని నిషేధం విధించాలంటూ నిరసనలు కూడా జరిగాయి. ఇలా వివాదాలతో వార్తల్లో నిలిచిన నయన తార సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా థియేటర్లలో రిలీజై నెల రోజులు పూర్తి కాకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అన్న పూరణి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్‌ 29) అర్ధరాత్రి నుంచే అన్నపూరణి ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా అన్నపూరణి సినిమాను నిర్మించారు. థమన్‌ సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. నయనతార ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి. దేశంలోనే బెస్ట్‌ చెఫ్‌ అవ్వాలని ఎన్నో కలలు కంటుంది. మాంసాహార వంటలకు సంబంధించి ఒక పెద్ద రెస్టారెంట్ కూడా ఓపెన్‌ చేయాలనుకుంటుంది. అయితే ఇందుకు నయన్‌ కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఒప్పుకోరు. అదే సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో రుచిని తెలుసుకునే శక్తిని కోల్పోతుంది. మరి నయన్‌ తన కలలను ఎలా సాకారం చేసుకుందన్నదే అన్నపూరణి సినిమా కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్