My Name Is Shruthi: ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక కొత్త సినిమా.. ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
దాదాపు నాలుగేళ్లకు పైగా సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి తర్వాత కెరీర్ పై ఫోకస్ చేసింది హన్సిక. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మై నేమ్ ఈజ్ శృతి. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న అడియన్స్ ముందుకు వచ్చింది. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ.. అనుహ్యంగా వాయిదా పడుతూ వచ్చింది. స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ ఈ సినిమాను రూపొందించారు.
దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ హన్సిక. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్డమ్ సంపాదించుకుంది. కొన్నాళ్లు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హన్సిక.. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు నాలుగేళ్లకు పైగా సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి తర్వాత కెరీర్ పై ఫోకస్ చేసింది హన్సిక. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మై నేమ్ ఈజ్ శృతి. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న అడియన్స్ ముందుకు వచ్చింది. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ.. అనుహ్యంగా వాయిదా పడుతూ వచ్చింది. స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ ఈ సినిమాను రూపొందించారు.
లేడీ ఓరియెంటెడ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది శృతి. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు నెలన్నర తర్వాత ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇందులో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్ కీలకపాత్రలు పోషించారు.
#MyNameIsShruthi Now Streaming on @PrimeVideoIN @ihansika @srinivasomkar6 #MuraliSharma #JayaPrakash @Poojaram22 #Ashika #Praveen #Prema @RajaRavindar @VinodhiniUnoffl @kishoreboyidapu @iamMarkKRobin @ChotaKPrasad @kk_lyricist @alapakaguna @vaishnaviarts22 @vikramdesigns1… pic.twitter.com/heVA0Z3oPu
— Cinema Mania (@ursniresh) December 29, 2023
కథ విషయానికి వస్తే.. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసే శ్రుతి స్కిన్ మాఫియా వలలో ఎలా పడింది ?.. ఆ మాఫియాను ఎదుర్కొంటూ ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించిందన్నదే ఈ సినిమా కథ. థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మరీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూద్దాం.
https://t.co/UGiBe4kb0n#mynameisshruthi trailer pic.twitter.com/QqEEsmHOh4
— Hansika (@ihansika) November 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.