పాత్రలకు ప్రాణం పొసే భామలు… లెస్బియన్స్ మెప్పించిన హీరోయిన్స్ వీరే
తెరపై బోల్డ్ రోల్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన వారు చాలా మంది ఉన్నారు. అలా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇష్టంగా చేశారని చెప్పలేం. క్యారెక్టర్‌కి న్యాయం చేయాలనేది తప్ప మరో ఉద్దేశం ఉండదు వారికి. తమ పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు. అదే విధంగా లెస్బియన్ పాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు.
సినిమాలతో పాటు ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్టిస్టులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ఛాలెంజింగ్ రోల్స్ ను ఎంచుకుంటూ ఉంటారు. తెరపై బోల్డ్ రోల్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన వారు చాలా మంది ఉన్నారు. అలా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇష్టంగా చేశారని చెప్పలేం. క్యారెక్టర్‌కి న్యాయం చేయాలనేది తప్ప మరో ఉద్దేశం ఉండదు వారికి. తమ పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు. అదే విధంగా లెస్బియన్ పాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం..
భూమి పడ్నేకర్
బాలీవుడ్‌లో భూమి పడ్నేకర్‌కు మంచి పేరుంది. ‘బదాయి దో’ సినిమాలో లెస్బియన్‌గా నటించింది ఈ అమ్మడు. ఒక లెస్బియన్ అమ్మాయి స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకునే కథతో ఈ సినిమా తెరకెక్కింది.
షెఫాలీ షా , కృతి కుల్హారి
‘హ్యూమన్’ అనే వెబ్ సిరీస్‌లో షెఫాలీ షా , కృతి కుల్హారీ నటించారు. ఇది హాట్‌స్టార్‌లో ప్రసారంఅవుతుంది. ఈ సిరీస్ కూడా లెస్బియన్ రిలేషన్ షిప్ గురించే. ఇద్దరు హీరోయిన్స్ అద్భుతమైన నటనను కనబరిచారు. బోల్డ్ సీన్ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె లెస్బియన్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనను అభిమానులు మెచ్చుకున్నారు.
లవ్లీ మసాజ్ పార్లర్
లవ్లీ మసాజ్ పార్లర్ అనేది ఉల్లు యాప్‌లో ప్రసారమయ్యే సిరీస్. ఈ వెబ్ సిరీస్‌లో చాలా బోల్డ్ కంటెంట్ తో ఉంటుంది. ఇది లెస్బియన్ల గురించిన సిరీస్.
హుమా ఖురేషి
‘దేద్ ఇష్కియా’ సినిమాలో లెస్బియన్‌గా హ్యూమా ఖురేషి నటించింది. ఆమె పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది.
షబానా అజ్మీ
‘ఫైర్’ సినిమాలో స్వలింగ సంపర్కం గురించి చర్చించారు. ఈ సినిమాలో షబానా అజ్మీ నటించింది. ఈ పాత్ర చేసినందుకు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అలియా ముఖర్జీ
అలియా ముఖర్జీ కథానాయికగా ‘ట్విస్టెడ్’ అనే సిరీస్ వచ్చింది. ఇదొక మర్డర్ మిస్టరీ కథ. ఇందులో లెస్బియన్ కథ కూడా ఉంది. ఇది జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.
మాధురీ దీక్షిత్
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన మాధురీ దీక్షిత్ ‘మజా మా’ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. పల్లవి పటేల్ అనే పాత్రలో నటించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.