AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Toppers List 2026: యూపీఎస్సీ సివిల్స్‌లో 1st ర్యాంకు కొట్టిన డాక్టర్‌ బాబు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే!

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 తుది ఫలితాలు శుక్రవారం (మార్చి 6) మధ్యాహ్నం విడుదలయ్యాయి. తాజా ఫలితాల్లో మొత్తం 958 మంది అభ్యర్ధులు అఖిల భారత సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యారు. ఇందులో టాప్‌ 10 ర్యాంకర్ల లిస్టును యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది..

UPSC Toppers List 2026: యూపీఎస్సీ సివిల్స్‌లో 1st ర్యాంకు కొట్టిన డాక్టర్‌ బాబు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే!
UPSC Topper Anuj Agnihotri
Srilakshmi C
|

Updated on: Mar 06, 2026 | 4:22 PM

Share

హైదరాబాద్‌, మార్చి 6: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 తుది ఫలితాలు శుక్రవారం (మార్చి 6) మధ్యాహ్నం విడుదలయ్యాయి. తాజా ఫలితాల్లో మొత్తం 958 మంది అభ్యర్ధులు అఖిల భారత సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యారు. ఇందులో టాప్‌ 10 ర్యాంకర్ల లిస్టును యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. టాపర్స్ జాబితాలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), రోల్ నంబర్, పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థుల పేరు వంటి ముఖ్యమైన వివరాలు మాత్రమే ఇచ్చింది. మార్కుల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొది. తాజా ఫలితాల్లో రాజస్థాన్ కు చెందిన అనుజ్ అగ్నిహోత్రి ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటారు. అనుజ్ తన మూడో ప్రయత్నంలో సివిల్స్ లో మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఉత్తీర్ణత సాధించిన 958 మందిలో 180 మంది అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), 55 మంది ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), 150 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో చేరతారు. అయితే 180 IAS పోస్టుల్లో 74 స్థానాలు అన్‌రిజర్వ్ చేశారు. ఇందులో 28 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు, 13 పోస్టులు షెడ్యూల్డ్ తెగలకు, 47 OBCలకు, 18 పోస్టులు EWS కేటగిరీకి రిజర్వ్ చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది.

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

UPSC తుది ఫలితం 2025 టాపర్స్ లిస్ట్..

  • అనుజ్ అగ్నిహోత్రి (రోల్‌ నంబర్‌ 131589)
  • రాజేశ్వరి సువే M (రోల్‌ నంబర్‌ 4000040)
  • అకాన్ష్ ధుల్ (రోల్‌ నంబర్‌ 3512521)
  • రాఘవ్ ఝుంఝుంవాలా (రోల్‌ నంబర్‌ 0834732)
  • ఇషాన్ భట్నగర్ (రోల్‌ నంబర్‌ 0409847)
  • జిన్నియా అరోరా (రోల్‌ నంబర్‌ 6410067)
  • అర్ రాజా మొహైదీన్ (రోల్‌ నంబర్‌ 0818306)
  • పక్షల్ సీక్రెట్ (రోల్‌ నంబర్‌ 0843487)
  • అస్తా జైన్ (రోల్‌ నంబర్‌ 0831647 )
  • ఉజ్వల్ ప్రియాంక్ (రోల్‌ నంబర్‌ 1523945)

కాగా మొత్తం 1087 సివిల్ సర్వీసెస్ పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్‌ విడుదలవగా.. ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 25న జరిగింది. మెయిన్ పరీక్ష ఆగస్టు 22 నుంచి ఆగస్టు 31, 2025 వరకు జరిగింది. మెయిన్‌ పరీక్ష తర్వాత 2,736 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరి రౌండ్ పరీక్ష అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) జనవరి 5న ప్రారంభమై ఫిబ్రవరి 27, 2026న ముగిసింది. ఫలితాలు ప్రకటించిన 15 రోజుల్లోపు మార్కులు UPSC వెబ్‌సైట్‌లో కమిషన్‌ అప్‌లోడ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర