Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayakanth Funeral : విజయ్ కాంత్ భౌతికకాయాన్ని సందర్శించిన దళపతి.. విజయ్ పై చెప్పు విసిరిన వ్యక్తి

కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ అంత్యక్రియలు ఈ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నారు. ఆయన పార్టీ అయిన DMDK ఆఫీస్‌ ముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. కానీ మెరీనా బీచ్‌లో MGR, జయలలిత మెమోరియల్‌ పక్కనే స్థలం ఇవ్వాలని విజయకాంత్‌ అభిమానులు

Vijayakanth Funeral : విజయ్ కాంత్ భౌతికకాయాన్ని సందర్శించిన దళపతి.. విజయ్ పై చెప్పు విసిరిన వ్యక్తి
Vijaykanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 29, 2023 | 3:49 PM

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపి తిరిగిరాని లోకాలకు వెళ్లారు కెప్టెన్ విజయ్ కాంత్. అనారోగ్యం కారణంగా గతకొంతకాలంగా ఇబ్బందిపడుతున్న విజయ్ కాంత్ నిన్న కన్నుమూశారు. కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ అంత్యక్రియలు ఈ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నారు. ఆయన పార్టీ అయిన DMDK ఆఫీస్‌ ముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. కానీ మెరీనా బీచ్‌లో MGR, జయలలిత మెమోరియల్‌ పక్కనే స్థలం ఇవ్వాలని విజయకాంత్‌ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ కాంత్ భౌతకకాయన్ని దర్శించుకున్నారు దళపతి విజయ్.

విజయ్ కాంత్ భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు విజయ్ కాంత్. దళపతి విజయ్ రావడంతో భారీగా అభిమానులు ఎగబడ్డారు. విజయ్ విజయకాంత్ పార్థివదేహాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. అలాగే విజయ్ కాంత కుటుంబసభ్యులను పరామర్శించారు. విజయ్ ఎమోషనల్ అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే విజయ్ కాంత్ భౌతికకాయాన్ని దర్శించుకోడానికి వచ్చిన దళపతి విజయ్ పై అభిమానులు ఎగబడ్డారు. విజయ్ ను చుట్టుముట్టి కదలకుండా చేశారు. సెక్యూరిటీ ఎంత ఆపినా అభిమానులు మాత్రం ఆగలేదు. విజయ్ ను చూసేందుకు ఆయనను తాకేందుకు ఎగబడ్డారు. ఇంతలో ఎవరో విజయ్ పై చెప్పు విసిరారు. అయితే అది విజయ్ కు తగల్లేదు. కొద్దిలో మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

విజయ్ కాంత్ పార్థివదేహాన్ని దర్శించుకున్న దళపతి విజయ్..

విజయ్ కాంత్ పార్థివదేహాన్ని దర్శించుకున్న దళపతి విజయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి