సోనిపట్‌లోని ఒక కుటుంబంలో 35 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆడపిల్ల జన్మించింది. ఈ శుభవార్తతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సైతం ఆనందంలో మునిగిపోయారు. పండుగ వాతావరణం నెలకొంది. ఆడపిల్ల రాకతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ శుభవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు.