Laxman Meesala: అల్లు అర్జున్ ఇంటి నిర్మాణంలో కూలీగా చేశా.. దెబ్బలు తగిలి రక్తం కారడంతో.. లక్ష్మణ్ మీసాల
శమంతకమణి, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్ 100, జార్జ్ రెడ్డి, జాంబి రెడ్డి, భీమ్లా నాయ్ సినిమాలు మీసాల లక్ష్మణ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవలే పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మీసాల లక్ష్మణ్ ఒకరు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన సుమారు 25కు పైగా సినిమాల్లో నటించాడు. హీరో స్నేహితుడిగా, విలన్‌గా వివిధ పాత్రల్లో మెరిశాడు. శమంతకమణి, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్ 100, జార్జ్ రెడ్డి, జాంబి రెడ్డి, భీమ్లా నాయ్ సినిమాలు మీసాల లక్ష్మణ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవలే పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీసాల లక్ష్మణ్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను పదో తరగతి తర్వాత చదువుకోలేదు. సినిమాల్లోకి రాక ముందు ఎన్నో పనులు చేశాను. భవన నిర్మాణ కూలీగా కూడా చేశాను. నాకు తెలియకుండానే సినీ ఇండస్ట్రీలో పలువురి ప్రముఖల ఇళ్ల నిర్మాణాల్లో పనిచేశాను’.
‘అల్లు అర్జున్ ఇంటి నిర్మాణానికి కూడా కూలీగా పని చేశాను. అయితే పని చేస్తున్నప్పుడు తెలియదు కానీ.. నిర్మాణం పూర్తైన తర్వాత అది అల్లు అర్జున్ హౌజ్ అని తెలిసింది. కూలీ పని చేసేటప్పుడు చాలా దెబ్బలు తగులుతుంటాయి. అలా బన్నీ ఇంటి నిర్మాణంలో కూడా పెద్ద దెబ్బ తగిలి రక్తం కారింది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ భవన నిర్మాణానికి సైతం పని చేశాను. అలాగే ప్రముఖ దర్శకుడు, రచయిత ఎస్వీ కృష్ణా రెడ్డితో పాటు పలువురి ప్రముఖల ఇళ్ల నిర్మాణాలకు తెలియకుండానే కూలీ పనులు చేశాను’ అని చెప్పుకొచ్చారు మీసాల లక్ష్మణ్.
మంగళవారం సినిమాలో మీసాల లక్ష్మణ్..
View this post on Instagram
మీసాల లక్ష్మణ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
జార్జిరెడ్డి, వంగ వీటి సినిమాలతో మంచి గుర్తింపు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.