ఉత్తర ప్రదేశ్, ఔరాయా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రాత్రి పడుకున్న యువతి ఉదయం కనిపించకుండా పోయింది. ఆమె గదిలో ఐదు అడుగుల పొడవున్న పాము కుబుసం లభ్యం కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.