AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పు నాదే.. ఆ కథను మార్చి తీసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.. అసలు విషయం బయటపెట్టిన సుకుమార్

ఆర్య, రంగస్థలం, పుష్ప 1, 2 సినిమాలతో భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించారు డైరెక్టర్ సుకుమార్. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్ .

తప్పు నాదే.. ఆ కథను మార్చి తీసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.. అసలు విషయం బయటపెట్టిన సుకుమార్
Sukumar
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2026 | 11:37 AM

Share

స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. తన క్రియేటివిటీతో సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలను అనుకున్నాడు సుకుమార్. జగడం సినిమాతో కెరీర్ మొదలు పెట్టి ఆర్యసినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. పుష్ప , పుష్ప 2 సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నారు సుకుమార్. ఇక ఇప్పుడు సుకుమార్ ఎవరోతో సినిమా చేయనున్నారా అని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదిలా ఉంటే సుకుమార్ ఓ సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను తెరకెక్కించిన ఓ సినిమాను కథ మార్చి తీసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అని అన్నారు సుకుమార్. ఆ సినిమా ఎదో తెలుసా.?

ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్

సుకుమార్ తెరకెక్కించిన సినిమాల్లో ఎన్నో క్రియేటివ్ సినిమాలు ఉన్నాయ్. వాటిలో మహేష్ బాబుతో చేసిన వన్ నేనొక్కడినే సినిమా ఒకటి. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా చాలా మందికి ఫేవరెట్ సినిమా ఇది. ఇప్పటికీ ఓటీటీలో, టీవీల్లో ఈ సినిమాను తెగ చూస్తుంటారు ప్రేక్షకులు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా గురించి గతంలో సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..

ఆ సినిమాను విజయవంతం చేయగలిగే అవకాశం ఉన్నా అది జరగలేదని సుకుమార్ అన్నారు. తనకు ఎక్కువ సమయం లభించిందని, సినిమాలో కొన్ని మార్పులు చేసి ఉండాల్సిందని సుకుమార్ చెప్పుకొచ్చారు. సినిమాకు సంబంధించి మరో వెర్షన్ ఉందని.. దాని ప్రకారం, సినిమాలోని మొదటి భాగం తర్వాత, ఇంటర్వెల్ సమయానికి హీరో నిజానికి డ్రామా ఆడుతున్నాడని, అతనికి మానసిక సమస్యలు లేవని స్పష్టమవుతుంది. కానీ ఆ వెర్షన్ కాదని మేము కథను మార్చి తీశాం.. ఆ వెర్షన్ ఎంపిక చేసుకోకపోవడానికి కారణం, హీరోకు సమస్య లేకపోతే ఎమోషన్స్ తగ్గుతాయని అనుకున్నాం. అయితే, ఈ మైండ్ గేమ్ వెర్షన్ ఎంపిక చేసుకొని ఉంటే హీరోయిజం చాలా బలంగా పెరిగి ఉండేదని సుకుమార్ అభిప్రాయపడ్డారు.  కనీసం రెండు అదనపు సన్నివేశాలను చిత్రీకరించి, ఎడిటింగ్ టేబుల్‌పై రెండు వెర్షన్‌లను పోల్చి చూసే అవకాశం తనకు లభించి ఉంటే బాగుండేదని అలా చేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యుండేది అని సుకుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అసలు బంగారం ధర ఇంకా తగ్గుతుందా? పెరుగుతుందా? తాజా రేట్ల వివరాలు
అసలు బంగారం ధర ఇంకా తగ్గుతుందా? పెరుగుతుందా? తాజా రేట్ల వివరాలు
రాణుల కాలం నాటి ఈ 5 చిట్కాలతో అందాన్ని ఈజీగా పెంచుకోండి
రాణుల కాలం నాటి ఈ 5 చిట్కాలతో అందాన్ని ఈజీగా పెంచుకోండి
జూలై 10 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
జూలై 10 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..
పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు