TSRTC: ‘తిక్క కుదిరింది’.. బస్సు పైకెక్కి రీల్స్‌లో పోజులు కొట్టాడు.. చివరికి సజ్జనార్ చేతుల్లో.!

సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్ అవుదామన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సు పైకెక్కి రీల్స్ చేస్తున్న యువకుడిని మందలించి, కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగుదేవులపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి సారతేజ..

TSRTC: 'తిక్క కుదిరింది'.. బస్సు పైకెక్కి రీల్స్‌లో పోజులు కొట్టాడు.. చివరికి సజ్జనార్ చేతుల్లో.!
Tsrtc
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 29, 2023 | 1:55 PM

సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్ అవుదామన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సు పైకెక్కి రీల్స్ చేస్తున్న యువకుడిని మందలించి, కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగుదేవులపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి సారతేజ.. నర్సాపూర్ డిపో పరిధిలోని పలు ఆర్టీసీ బస్సుల పైకి ఎక్కి రీల్స్ చేసేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓవర్‌నైట్ పాపులర్ కావడం కోసం హీరో రామ్ చరణ్ సినిమాలోని మగధీర మూవీలోని ఓ సాంగ్, ‘సై.. సై..’ అంటూ సాగే మరో పాటకు.. దౌల్తాబాద్ వెళ్లే మార్గంలోని రన్నింగ్ బస్సు పైకి ఎక్కి రీల్స్ చేశాడు. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఈ యువకుడు చేసిన రీల్స్ చూసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విద్యార్థి సారతేజను పిలిపించి మందలించారు. కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, ఇలా ప్రమాదకరమైన రీల్స్ చేసి ప్రమాదాలకు గురి కావొద్దంటూ, ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో గుర్తు చేసుకోవాలంటూ హితపు పలికారు. సజ్జనార్ మాటలతో తనలో మార్పు వచ్చింది అని, ఇక నుంచి ఇలాంటి ప్రమాదకరమైన రీల్స్ చేయనంటూ, చదువుకుని ఉన్నతంగా జీవిస్తానంటూ యువకుడు సారతేజ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

వీడియో 1:

వీడియో 2:

వీడియో 3:

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త