Telangana: ఎగబడి చలాన్లు కడుతోన్న వాహనదారులు.. సర్వర్‌ హ్యాంగ్‌ అయ్యే పరిస్థితి

తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు వాహనదారుల ఇప్పటి వరకు చెల్లించారు. చలాన్ల ద్వారా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 3.54 లక్షల చలాన్ల చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. దీంతో ఒక్క హైదరాబాద్ పరిధిలో చలాన్లతోనే...

Telangana: ఎగబడి చలాన్లు కడుతోన్న వాహనదారులు.. సర్వర్‌ హ్యాంగ్‌ అయ్యే పరిస్థితి
TS E Challan
Follow us

|

Updated on: Dec 29, 2023 | 12:18 PM

వాహనదారులతో చలాన్లు కట్టించడానికి అధికారులు ఎన్నో తిప్పలు పడుతుంటారు. భయపెట్టినా, బతిమాలినా ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్లు చెల్లించడానికి మొగ్గు చూపరు. అయితే అధికారులు తీసుకున్న ఓ నిర్ణయంతో వాహనదారులు మాత్రం ఎగబడి చలాన్లు కడుతున్నారు. ఎంతలా అంటే.. ఏకంగా సర్వర్‌ హ్యాంగ్‌ అయ్యేంతలా.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు వాహనదారుల ఇప్పటి వరకు చెల్లించారు. చలాన్ల ద్వారా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 3.54 లక్షల చలాన్ల చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. దీంతో ఒక్క హైదరాబాద్ పరిధిలో చలాన్లతో రూ. 2.62 కోట్ల ఆదాయం సమకూరింది. సైబరాబాద్ పరిధిలో 1.82లక్షల చలాన్ల చెల్లింపు జరగగా రూ.1.80 కోట్ల ఆదాయం వచ్చింది.

రాచకొండ పరిధిలో 93 వేల చలాన్ల చెల్లింపు జరగగా.. రూ.76.79 లక్షల ఆదాయం వచ్చింది. చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్ హ్యాంగ్‌ అవుతోంది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. మరోవైపు ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీసులు వాహనాల చలానా డిస్కౌంట్ లపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన సెంటర్‌లలో చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌ల గురించి మైక్‌లోచెబుతూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

సెంటర్లలో వాహనదారులను ఆపి వారికి డిస్కౌంట్‌ల గురించి వివరిస్తూ వారితో చలనాలను కట్టిస్తున్నారు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం కల్పించారు. జనవరి 10వ తేదీ వరకు చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించే వెలుసుబాటు ఇచ్చారు. టూ వీలర్స్‌, త్రీ వీలర్స్‌ వాహనాలపై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, హెవీ వెహికల్స్‌పై 60 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ ఇచ్చింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్