AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వన్యప్రాణులను వేటాడిన దుండగులు.. 15 మంది అరెస్ట్‌! పరారీలో మరో 16 మంది..

సిర్పూర్‌ అటవీశాఖ రేంజ్‌ పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో కొందరు దుండగులు విద్యుత్‌ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చారు. అ ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించినట్లు కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో వేణుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం (డిసెంబర్‌ 28) ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. డిసెంబర్‌ 23వ తేదీన..

Telangana: వన్యప్రాణులను వేటాడిన దుండగులు.. 15 మంది అరెస్ట్‌! పరారీలో మరో 16 మంది..
Sirpur Forest Range
Srilakshmi C
|

Updated on: Dec 29, 2023 | 10:39 AM

Share

సిర్పూర్‌, డిసెంబర్‌ 28: సిర్పూర్‌ అటవీశాఖ రేంజ్‌ పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో కొందరు దుండగులు విద్యుత్‌ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చారు. అ ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించినట్లు కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో వేణుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం (డిసెంబర్‌ 28) ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. డిసెంబర్‌ 23వ తేదీన చింతకుంట అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు విద్యుత్‌ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చారు.

దీనిపై సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో మొత్తం 31 మంది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో 31 మందిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో 15 మందిని ఈ నెల 28న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో 16 మంది కోసం గాలిస్తున్నారు. అటవీ జంతువులను వేటాడినా, పంట పొలాల చుట్టూ విద్యుత్‌ కంచెలు అమర్చినా కఠిన చర్యలు తప్పవని ఎఫ్‌డీవో వేణుబాబు హెచ్చరించారు. ఈ

ముంబై నుంచి అయోధ్యకు కాలినడకన ముస్లిం యువతి

వచ్చే నెలలో అయోధ్యలోని రామజన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని దేశ, విదేశాల్లో కోట్లాది మంది ఉవ్విళ్లూరు తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ముంబైకి చెందిన షబ్నమ్‌ అనే ముస్లీం యువతి కాషాయ జెండాను చేతపట్టి ముంబై నుంచి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్నారు. శ్రీరాముడిని పూజించడానికి హిందువుగా ఉండాల్సిన అవసరం లేదని.. మనిషై ఉంటే చాలని ఆమె చెబుతోంది. అంతేకాకుండా తనకు శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసాలు ఉన్నాయంటున్నారు. అందుకే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని రమణ్‌ రాజ్‌ శర్మ, వినీత్‌ పాండేలతో కలిసి దాదాపు 1,425 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.