Hyderabad: బానెట్‌లోంచి ఒక్కసారిగా చెలరేగిన పొగలు.. నడిరోడ్డుపై కాలిబూడిదైన BMW కారు

రాష్ట్ర సచివాలయం వద్ద మింట్ కంపౌండ్ రోడ్డుపై వెళుతున్న బీఎండబ్ల్యూ (టీఎస్‌ 09 ఎఫ్‌ఎం 0094) కారులోంచి ఒక్కసారిగా నల్లటి పొగలు, మంటలు చెలరేగాయి. బానెట్‌లోంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన అందులోని వ్యక్తి మింట్‌ కాంపౌండ్‌ వద్ద ఉన్న మర్రి చెట్టు కింద కారును నిలిపివేశారు. ఆ తర్వాత కారులోంచి ఒక్కసారిగా ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగలు చుట్టుముట్టాయి..

Hyderabad: బానెట్‌లోంచి ఒక్కసారిగా చెలరేగిన పొగలు.. నడిరోడ్డుపై కాలిబూడిదైన BMW కారు
BMW car catches fire
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 28, 2023 | 10:52 AM

నారాయణగూడ, డిసెంబర్ 28: రాష్ట్ర సచివాలయం వద్ద మింట్ కంపౌండ్ రోడ్డుపై వెళుతున్న బీఎండబ్ల్యూ (టీఎస్‌ 09 ఎఫ్‌ఎం 0094) కారులోంచి ఒక్కసారిగా నల్లటి పొగలు, మంటలు చెలరేగాయి. బానెట్‌లోంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన అందులోని వ్యక్తి మింట్‌ కాంపౌండ్‌ వద్ద ఉన్న మర్రి చెట్టు కింద కారును నిలిపివేశారు. ఆ తర్వాత కారులోంచి ఒక్కసారిగా ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగలు చుట్టుముట్టాయి. ఏం జరుగుతుందో తెలియక జనం భయాందోళనకు గురయ్యారు. వెంటనే కారు ముందు, వెనక భాగాలు, లోపల సీట్లు, స్టీరింగ్ తదితర చోట్లకు మంటలు శరవేగంగా వ్యాపించాయి. కొద్దిక్షణాల్లోనే మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో స్థానికులు మంటలు అదుపు చేయడానికి ఇసుక చల్లారు. మరికొందరు వాటర్‌ బాటిళ్లతో నీళ్లు చల్లారు. కానీ మంటలు తగ్గుముఖం పట్టకపోగా మరింత విజృంభించాయి. దీంతో స్థానికుల కేకలు. అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇంతలో చెట్లకు నీళ్లు పోస్తున్న జీహెచ్‌ఎంసీ వాటర్‌ ట్యాంకర్‌ను ప్రమాదస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని నాలుగు వైపుల నుంచి కాలిపోతున్న కారుపై నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్ఠం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. కారు సోమాజిగూడ ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న కున్‌ మోటర్స్‌ పేరిట ఉన్నట్లు ఖైరతాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఆ షోరూం ప్రతినిధి బాలకృష్ణ పోలీసు స్టేషన్‌కొచ్చి తమ సార్‌ గోవింద్‌ రెడ్డి కారు నడుపుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులకు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఆల్ప్రజోలం తయారీదారుల అరెస్టు

నిషేధిత ఆల్ప్రజోలం డ్రగ్‌ ను తయారు చేస్తున్న వ్యక్తులను తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. సుమా రూ.1.77 కోట్ల విలువైన ఆల్ప్రజోలం డ్రగ్‌తోపాటు రూ.11.7 కోట్ల ముడి పదార్థాలు, ల్యాబ్‌ పరికరాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్