AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2024: కొత్త ఏడాదిలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు నిజమైన ప్రేమ దక్కుతుంది.. ఆ అదృష్ట రాశులు ఏమిటంటే

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం 2024 సంవత్సరంలో కొన్ని రాశులకు చెందిన వారు ఆదాయాన్ని పెంచుకుంటే, మరొకొందరికి జీవితంలో పట్టిందల్లా బంగారమే.. అదే సమయంలో మరికొందరు ప్రేమ విషయంలో సక్సెస్ ను అందుకుంటారు.ఈ రోజు కొత్త ఏడాదిలో నిజమైన ప్రేమని పొందుతారు. మనసుకు నచ్చిన సహచరులను కనుగొంటారని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది. ఈ రోజు మనసుకు నచ్చిన భాగస్వామిని పొందే ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

New Year 2024: కొత్త ఏడాదిలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు నిజమైన ప్రేమ దక్కుతుంది.. ఆ అదృష్ట రాశులు ఏమిటంటే
Love Horoscope 2024
Surya Kala
|

Updated on: Dec 30, 2023 | 7:07 AM

Share

కొత్త సంవత్సరం 2024లో అడుగు పెట్టనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో తమ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోవాలని కోరుకుంటారు. వృత్తి, విద్య, సంపద, ప్రేమ, వివాహం వంటి విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. దీంతో తమ రాశిఫలాలపై దృష్టిని సారిస్తారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం 2024 సంవత్సరంలో కొన్ని రాశులకు చెందిన వారు ఆదాయాన్ని పెంచుకుంటే, మరొకొందరికి జీవితంలో పట్టిందల్లా బంగారమే.. అదే సమయంలో మరికొందరు ప్రేమ విషయంలో సక్సెస్ ను అందుకుంటారు.ఈ రోజు కొత్త ఏడాదిలో నిజమైన ప్రేమని పొందుతారు. మనసుకు నచ్చిన సహచరులను కనుగొంటారని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది. ఈ రోజు మనసుకు నచ్చిన భాగస్వామిని పొందే ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వం చాలా సున్నితం. 2024లో భావోద్వేగ సంబంధాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారు మంచి మనసున్న జీవిత భాగస్వామిని కోరుకుంటారు. తమకు వచ్చిన  అవకాశాలను సద్వివినియోగం చేసుకోవడానికి రాశికి సంబంధించిన సూచనలు తీసుకుంటారు. 2024లో కర్కాటక రాశికి చెందిన వారు తమ హృదయానికి నచ్చిన మెచ్చిన ప్రేమని దక్కించుకునే ఛాన్స్ ఉంది.

తుల రాశి: ఈ రాశికి చెందిన వారు సామరస్యంతో మెలుగుతారు. జీవితాన్ని సమతుల్యతను పాటించే, ఆనందాన్ని కలిగించే ప్రేమను కావాలని కోరుకుంటారు. 2024 ఏడాది ముగిసే సమయానికి తులారాశి వారు తమ బలాలు, బలహీనతలను పూర్తి అర్ధం చేసుకునే జీవిత సహచరుల పట్ల ఆకర్షితులవుతారు. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి తమకు నచ్చిన ప్రేమని వెతుక్కుంటూ వెళ్తారు.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: 2024లో వృశ్చిక రాశి వారు ఉద్వేగభరితమైన నేచర్ కలిగి ఉంటారు. మనసుకి సంబంధించిన రిలేషన్ ను కోరుకుంటారు. తమకు కావాల్సిన ప్రేమ భాగస్వామి అన్వేషణ పూర్తి అయ్యి అవకాశం ఉంది. భావోద్వేగ సాన్నిహిత్యంతో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది.

మీన రాశి: ఈ రాశి వారు దయ కలిగిన వ్యక్తులు. కలలు కనే  నేచర్ కలిగి ఉంటారు. తమ ఆత్మను ప్రతిబింబించే ప్రేమను దక్కించుకుంటారు. 2024లో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు ఉద్వేగభరితమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేలా పరిస్థితులు వస్తాయి. మొత్తానికి కొత్త ఏడాదిలో మీనరాశి వారికీ నచ్చిన ప్రేమ దక్కుతుంది.

ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తులకు 2024లో నిజమైన ప్రేమ దక్కుతుంది. వీరి జీవితాల్లో ప్రేమ, సుఖ సంతోషాలు ఆనందం చిగురిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు