Mahabhagya Yoga: ధనూ రాశిలోకి కుజ గ్రహ ప్రవేశం.. ఆ రాశుల వారికి మహా భాగ్య యోగం..!

కుజుడికి ధనూ రాశి మిత్ర క్షేత్రం. పైగా ఈ కుజుడి మీద ధనూ రాశి అధిపతి, కుజుడికి మిత్రుడు అయిన గురు గ్రహం దృష్టి కూడా ఉన్నందువల్ల కుజుడు తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కుజుడు ఈ రాశిలో ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగుతాడు. అందువల్ల ఈ ఆరు రాశుల వారికి ఏదో విధంగా ఆదాయం పెంచడం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగించడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది.

Mahabhagya Yoga: ధనూ రాశిలోకి కుజ గ్రహ ప్రవేశం.. ఆ రాశుల వారికి మహా భాగ్య యోగం..!
Mahabhagya Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 29, 2023 | 6:25 PM

ధనూ రాశిలోకి ప్రవేశించిన కుజ గ్రహం వల్ల ఆరు రాశులకు తప్పకుండా మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. కుజుడికి ధనూ రాశి మిత్ర క్షేత్రం. పైగా ఈ కుజుడి మీద ధనూ రాశి అధిపతి, కుజుడికి మిత్రుడు అయిన గురు గ్రహం దృష్టి కూడా ఉన్నందువల్ల కుజుడు తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కుజుడు ఈ రాశిలో ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగుతాడు. అందువల్ల ఈ ఆరు రాశుల వారికి ఏదో విధంగా ఆదాయం పెంచడం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగించడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. చిన్న ప్రయత్నంతో అత్యధిక ధన లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. మధ్య మధ్య స్కంద స్తోత్రం చదవడం వల్ల కుజుడు మరింతగా అనుకూలంగా మారడం జరుగుతుంది. కుజుడు ధనూ రాశి ప్రవేశం వల్ల అత్యధికంగా ఆర్థిక ప్రయోజనం పొందే రాశులుః మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం.

  1. మేషం: ఈ రాశ్యధిపతి అయిన కుజుడు భాగ్య స్థానంలో ప్రవేశించడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా మహా భాగ్య యోగం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా, అనేక మార్గాలలో ధన సంపాదనకు అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. జీవితంలో ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది.
  2. సింహం: ఈ రాశివారికి పూర్ణ శుభుడైన కుజుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికపరమైన నిర్ణయాలు, ఆలోచనలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. లాటరీలు, జూదాలు, ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు, షేర్లు ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. ఆర్థిక పరంగా మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
  3. వృశ్చికం: ఈ రాశ్యధిపతి అయిన కుజుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి చోటు చేసుకుంటాయి. కుటుంబపరంగా ధనాదాయం బాగా పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు సునాయాసంగా ధన సహాయం అందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా అధికమవుతుంది. లాభసాటి అయిన లావాదేవీలు జరుగుతాయి. లాభదాయకమైన పరిచయాలు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశిలో కుజుడు ప్రవేశించడంతో పాటు రాశ్యధిపతి గురువు వీక్షణ కలిగి ఉండడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఈ సమయాన్ని ఎంత సద్విని యోగం చేసుకుంటే అంత మంచిది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
  5. కుంభం: ఈ రాశికి లాభస్థానంలో కుజ సంచారం వల్ల స్థిరాస్తులు కలిసి రావడం, ఆస్తుల విలువ పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో అనూహ్యంగా లాభాలు, రాబడి పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరగడం, ప్రమోషన్లు రావడం వంటివి చోటు చేసుకుంటాయి. సోదరులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు జరు గుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంటుంది. అప్రయత్న ధన లాభం ఉంది.
  6. మీనం: ఈ రాశివారికి ధనాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో సంచారం ప్రారంభించినందువల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ధన లాభం బాగా పెరుగుతుంది. అనేక మార్గాలతో ధన సంపాదనకు అవకాశం ఉంది. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలనివ్వడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?