Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Horoscope 2024: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఒంటిరిగా ఉంటూ సరికొత్త ఆవిష్కరణపై దృష్టి పెడతారట..

కొందరు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమదైన ప్రతిభతో ముందుకు వెళ్తారు. అదే సమయంలో కొందరికి ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో, ఎలా సాధించాలో  తెలుసు.. ఇలా భిన్నమైన ఆలోచనలు అభిరుచులు కలిగి ఉంటారు. దీనికి కారణం వారు జన్మించిన రాశులు,, నక్షత్రాలు అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం 204 లో సొంతంగా ఏదైనా ఆవిష్కరించాలనే ఆలోచనతో.. తమని తాము పదిమంది ముందు స్పెషల్ గా ఆవిష్కరించడానికి ఒంటరిగా జీవిస్తారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెల్సుకుందాం.. 

New Year Horoscope 2024: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఒంటిరిగా ఉంటూ సరికొత్త ఆవిష్కరణపై దృష్టి పెడతారట..
New Year 2024
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Jan 02, 2024 | 12:30 PM

మరికొన్ని గంటల్లో 2023కి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024కి స్వాగతం చెప్పడానికి ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో తమ జీవితం ఎలా ఉందొ తెలుసుకోవాలని ఆసక్తిని కలిగి ఉంటారు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు స్వీయ నియంత్రణ కలిగి ఉంది పది మందికి ప్రయోజనం వచ్చే విధంగా నడుకుంటే.. మరి కొందరు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమదైన ప్రతిభతో ముందుకు వెళ్తారు. అదే సమయంలో కొందరికి ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో, ఎలా సాధించాలో  తెలుసు.. ఇలా భిన్నమైన ఆలోచనలు అభిరుచులు కలిగి ఉంటారు. దీనికి కారణం వారు జన్మించిన రాశులు,, నక్షత్రాలు అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం 204 లో సొంతంగా ఏదైనా ఆవిష్కరించాలనే ఆలోచనతో.. తమని తాము పదిమంది ముందు స్పెషల్ గా ఆవిష్కరించడానికి ఒంటరిగా జీవిస్తారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెల్సుకుందాం..

కుంభ రాశి: ఈ రాశికి చెందిన వారి స్వభావం స్వేచ్ఛ స్వాతంత్య్రని కోరుకుంటారు. స్వీయ ఆవిష్కరణ స్వభావానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తులు కుంభ రాశి. వీరు 2024లో వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అంతేకాదు వీరు తమకు సంబంధించిన వ్యక్తిగత కోరికలను తీర్చుకోవడంపై దృష్టి పెడతారు. అభిరుచులను నెరవేర్చుకోవడంపై ఆసక్తిని కలిగి ఉండడంతో జీవితాన్ని ఆనందిస్తారు. జీవిత భాగస్వామితో సరదాగా ఉంటూ పరిమితలేని ఆనందాన్ని సొంతం చేసుకంటారు.

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వారి తీరు సాహసం.. అవును ధనుస్సు రాశివారు సాహసికులు. అయితే  2024లో ఎక్కువగా ఒంటరి ప్రయాణాలను చేస్తూ తమని తాము మోటివేట్ చేసుకుంటారు. నిరంతర అన్వేషణ, స్వాతంత్ర్యం కోసం ధనుస్సు రాశివారు కొత్త అనుభవాలను వెతుకుతున్నప్పుడు ఒంటరితనం సంతోషంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు స్వతంత్ర స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఆశయ సాధనకు పేరుగాంచిన, వ్యక్తులు మేషరాశి వారు. 2024లో తమ శక్తిని వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి వినియోగిస్తారు. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన వీరు స్వీయ-ఆవిష్కరణ, వ్యక్తిగత విజయాన్ని స్వీకరిస్తూ.. ఒకే విధంగా జీవించాలని భావిస్తారు. ఒంటరిగా జీవించడానికి ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంది.

మిథున రాశి: ఈ రాశికి చెందిన వారు సామాజిక సృహను కలిగి ఉంటారు. అయితే 2024లో ఒంటరిగా ఉండాలని .. అందులో సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటారు. తమ ఉత్సుకత, విభిన్నమైన కనెక్షన్‌ల కోసం ఎక్కువగా ఒంటరిగా ప్రయాణం చేయాలనీ భావిస్తారు. భిన్నమైన సామజిక పరిస్థితులను అన్వేషించడానికి ఇష్టపడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు