Ayodya Ram Mandir: రామ మందిర రూట్ మ్యాప్.. రామాలయ నిర్మాణం.. సౌకర్యాలు ఎలా ఉండనున్నాయంటే

రామాలయ ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తి చేసుకోవడంతో రామాలయం ప్రవేశం, నిర్మాణం ఎలా ఉంటుంది.. ఏఏ సౌకర్యాలు ఉంటాయి అనే విషయాలను తెలియజేస్తూ రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ఓ రూట్ మ్యాప్ ని రిలీజ్ చేసింది. 54,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామాలయ ప్రాంగణం దాదాపు 2.7 ఎకరాల భూమిని కలిగి ఉంది. మొత్తం రామమందిర కాంప్లెక్స్ దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఎటువంటి సందర్భంలోనైనా లక్ష మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది.

Ayodya Ram Mandir: రామ మందిర రూట్ మ్యాప్.. రామాలయ నిర్మాణం.. సౌకర్యాలు ఎలా ఉండనున్నాయంటే
Ram Mandir Master Plan
Follow us

|

Updated on: Dec 31, 2023 | 9:05 AM

దేశ విదేశాల్లో ఉన్న హిందువులు కొత్త సంవత్సరం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామయ్య జన్మ భూమి అయోధ్యయంలో 2024 జనవరి 22న రామాలయం ప్రారంభించనున్నారు. గర్భ గుడిలో బాల రాముడు  ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని రామయ్య భక్తులు లక్షలాదిగా తరలి రానున్నారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రామాలయ ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తి చేసుకోవడంతో రామాలయం ప్రవేశం, నిర్మాణం ఎలా ఉంటుంది.. ఏఏ సౌకర్యాలు ఉంటాయి అనే విషయాలను తెలియజేస్తూ రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ఓ రూట్ మ్యాప్ ని రిలీజ్ చేసింది.

54,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామాలయ ప్రాంగణం దాదాపు 2.7 ఎకరాల భూమిని కలిగి ఉంది. మొత్తం రామమందిర కాంప్లెక్స్ దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఎటువంటి సందర్భంలోనైనా లక్ష మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది.

అయోధ్య రామాలయనిర్మాణం.. సౌకర్యాలు ఎలా ఉండనున్నాయంటే

  1. ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునే విధంగా రామాలయ నిర్మాణం చేపట్టారు. మూడు అంతస్థుల్లో నిర్మిస్తున్నారు. మొదటి అంతస్థు ఇప్పటికే పూర్తి అయింది. ఆలయంలోకి ప్రవేశం తూర్పు నుంచి ప్రవేశించి దక్షిణం వైపు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.
  2. బాల రామయ్య కొలువుదీరనున్న ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
  3. ఆలయాన్ని సాంప్రదాయ నాగరా శైలిలో అష్టభుజి ఆకారంలో 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మించారు.
  4. తూర్పున ఉన్న ప్రవేశ ద్వారం గోపురం శైలిలో నిర్మించబడుతుంది. ఇది దక్షిణ దేవాలయాలను సూచిస్తుంది. ఆలయ గోడలు రాముడి జీవితాన్ని వర్ణించే కళాకృతులను ప్రదర్శిస్తాయి.
  5. ఆలయంలోని ఒకొక్కక అంతస్థుతు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్థంభాలు, 44 ద్వారాలుంటాయి.
  6. ఉత్తరదిశన ఉండే దేవాలయాలకు గర్భగుడి (పెర్కోటా) చుట్టూ బయటి భాగముండదు.  అయితే రామయ్య కొలువుదీరే ఆలయంలో 14 అడుగుల వెడల్పు, 732 మీటర్ల విస్తీర్ణంలో పేర్కోటా ఉంది.
  7. పెర్కోటా నాలుగు దిశల్లో సూర్యుడు, భగవతి దేవి, గణేశుడు, శివుడికి అంకితం చేయబడింది. ఉత్తరాన అన్నపూర్ణ, దక్షిణాన హనుమంతుడి మందిరం ఉంటాయి.
  8. మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ట, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, భక్త శబరి, అహల్య ఆలయాలుంటాయి.
  9. అయోధ్యలోని కుబేర్ తిల వద్ద జటాయువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
  10. సూర్యకిరణాలు భగవంతుని శిశు స్వరూపమైన రామ్ లల్లా విగ్రహంపై పడేలా నిర్మించారు.
  11. రామాలయం కాంప్లెక్స్‌లో ఆరోగ్య సంరక్షణ కేంద్రం, టాయిలెట్ బ్లాక్ సహా ఇతర సౌకర్యాలుంటాయి.
  12. అంతేకాదు దర్శనం కోసం వెళ్లేవారు తమ చెప్పులను, మొబైల్ ఫోన్స్ , వాచీలను ఇక్కడే భద్రపరుచుకోవాలి. సుమారు 25 వేలమంది తమ ఎలక్ట్రికల్ వస్తువులను ఇక్కడ డిపాజిట్ చేసుకునే వీలుంటుంది.
  13. రామమందిరం ఆలయ సముదాయంయలో రెండు మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, నీటి శుద్ధి ప్లాంట్, ప్రత్యేక విద్యుత్ లైన్ ను ఏర్పాట్లు చేశారు. భూగర్భ జలాశంయ నుంచి నీటిని తీసుకునే విధంగా అగ్నిమాపక దళ విభాగం పనిచేస్తుంటుంది. అంతేకాదు అవసరం అయితే నీటిని సరయు నది నుంచి తీసుకోనున్నారు.
  14. మొత్తం 70 ఎకరాల ఆలయ ప్రాంగణంలో 70 శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది. వందేళ్లకు పైగా పురాతనమైన చెట్లు ఉన్నాయి. దట్టమైన వనం సూర్యుడి కిరణం భూమి మీద సోకకుండా చేస్తుంది.
  15. ఆలయ ప్రాంగణంలో చెప్పులు ధరించకుండా నడవాల్సి ఉంటుందని. ఈ నేపథ్యంలో కాళ్లుకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో కూడా కాళ్లకు చెప్పుల్లేకుండా నడిచే విధంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు