Maharastra: మహారాష్ట్రలోని గ్లోవ్స్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంపై అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే మాట్లాడుతూ.. స్థానికులు తనకు తెల్లవారుజామున 2.15 గంటలకు ఫోన్ చేశారని.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నా.. అప్పటికే ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయిందని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురి మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో గ్లోవ్స్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. అగ్నిప్రమాదం అనంతరం గందరగోళం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికి ఫ్యాక్టరీ మొత్తం దగ్ధమైంది. గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంపై అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే మాట్లాడుతూ.. స్థానికులు తనకు తెల్లవారుజామున 2.15 గంటలకు ఫోన్ చేశారని.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నా.. అప్పటికే ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయిందని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురి మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు.
ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలూజ్ ఎంఐడీసీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎలా చెలరేగాయి అనే విషయంపై సమాచారం ఇంకా తెలియలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ పనులు ప్రారంభించారు.
Chhatrapati Sambhajinagar, Maharashtra: On fire in hand gloves manufacturing factory in Waluj MIDC, Fire officer Mohan Mungse says, “We got the call at 2.15 am. When we reached the spot, the entire factory was on fire. The local people informed us that six people were trapped… https://t.co/A5S3prRs8E pic.twitter.com/WPoKDfxesl
— ANI (@ANI) December 30, 2023
ఆరుగురి మృతదేహాలు వెలికితీశారు మంటలు చెలరేగిన సమయంలో ఫ్యాక్టరీలో కొందరు నిద్రిస్తున్నారని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి తెలిపారు. ఫ్యాక్టరీ లోపల 10-15 మంది ఉన్నారు. వీరిలో కొంతమంది తప్పించుకోగలిగారని మరికొందరు మంది లోపల చిక్కుకున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకూ రెస్క్యూ సిబ్బంది ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..