Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట.. ఆదివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే.
శనివారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అయితే ఆదివారం కూడా బంగారం ధర స్థిరంగా కొనసాగింది. దేశంలో అన్ని చోట్ల ఆదివారం గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,870 వద్ద కొనసాగుతోంది...
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు పెరుగుతూ పోయిన బంగారం ధరలకు శనివారం బ్రేక్ పడింది. శనివారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అయితే ఆదివారం కూడా బంగారం ధర స్థిరంగా కొనసాగింది. దేశంలో అన్ని చోట్ల ఆదివారం గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,870 వద్ద కొనసాగుతోంది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58,700కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,970 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,870గా నమోదైంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 59,100కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ అత్యధికంగా రూ. 64,470 వద్ద కొనసాగుతోంది. కోలకతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,870 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,550కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,870 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,870 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,550, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 63,870 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 300 పెరిగింది. దీంతో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 78,600గా ఉంది. ఇక చెన్నైతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..