Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

McDonald Malaysia: మలేషియాలో మెక్‌డొనాల్డ్స్‌పై బహిష్కరణ ప్రచారం.. కోర్టును ఆశ్రయించిన కంపెనీ..!

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య, ఫుడ్ ఫ్రాంచైజ్ కంపెనీ మెక్‌డొనాల్డ్ వార్తల్లో నిలిచింది. వాస్తవానికి, హమాస్‌తో ఘర్షణ సమయంలో మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారాన్ని అందించిందని చెప్పడంతో వివాదం మొదలైంది. దీని తరువాత, అమెరికన్ ఫుడ్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌పై చాలా చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

McDonald Malaysia: మలేషియాలో మెక్‌డొనాల్డ్స్‌పై బహిష్కరణ ప్రచారం.. కోర్టును ఆశ్రయించిన కంపెనీ..!
Mcdonald Malaysia
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 30, 2023 | 6:06 PM

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య, ఫుడ్ ఫ్రాంచైజ్ కంపెనీ మెక్‌డొనాల్డ్ వార్తల్లో నిలిచింది. వాస్తవానికి, హమాస్‌తో ఘర్షణ సమయంలో మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారాన్ని అందించిందని చెప్పడంతో వివాదం మొదలైంది. దీని తరువాత, అమెరికన్ ఫుడ్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌పై చాలా చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, తాజాగా మలేషియాలో మెక్‌డొనాల్డ్స్‌ను బహిష్కరించాలంటూ ఉద్యమం ఊపందుకుంది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది మెక్‌డొనాల్డ్స్‌.

ఇలాంటి తప్పుడు ఆందోళనల వల్ల తమ వ్యాపారం నష్టపోయిందని మెక్‌డొనాల్డ్స్ మలేషియా వ్యాజ్యం దాఖలు చేసింది. అటువంటి పరిస్థితిలో, కంపెనీ 6 మిలియన్ రింగ్‌గిట్ అంటే 1.31 మిలియన్ డాలర్లు)పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మలేషియా మెజారిటీ ముస్లిం దేశం పాలస్తీనియన్లకు గట్టి మద్దతుదారుగా ఉండటం గమనార్హం. అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్ సైనికులకు 4,000 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారనే వార్త వ్యాపించడంతో, ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున మెక్‌డొనాల్డ్స్‌ను బహిష్కరించారు. దీని కారణంగా కంపెనీ భారీ నష్టాన్ని చవిచూసింది. అప్పటి నుండి, అనేక అరబ్ దేశాలు మెక్‌డొనాల్డ్స్‌పై బహిష్కరణ ప్రచారాన్ని ప్రారంభించాయి. వీటిలో జోర్డాన్, టర్కీ, సౌదీ అరేబియా అలాగే పాకిస్తాన్ ఉన్నాయి.

మలేషియాలోని మెక్‌డొనాల్డ్ లైసెన్స్ పొందిన గెర్బాంగ్ అలఫ్ రెస్టారెంట్ సోషల్ మీడియాలో త్రో క్యాంపెయిన్ నడుపుతున్న వారిపై దావా వేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, దేశంలోని ఉద్యమం మెక్‌డొనాల్డ్స్‌ను బహిష్కరించేలా ప్రజలను ప్రేరేపించిందని గెర్బాంగ్ అలఫ్ రెస్టారెంట్లు ఆరోపించాయి. ఇది భారీ నష్టాలకు దారితీసింది. చాలా మంది ఉద్యోగులను కంపెనీ తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మెక్‌డొనాల్డ్స్ మలేషియా తన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి BDS మలేషియాపై దావా వేసింది. BDS మలేషియా ఫాస్ట్ ఫుడ్ కంపెనీని పరువు తీయడాన్ని నిర్ద్వంద్వంగా ఖండించింది. ఈ విషయాన్ని కోర్టు ద్వారానే తేల్చుకుంటామని స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…