AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరే.. ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఏంటిలా మారిపోయాడు? షాక్‌లో ఫ్యాన్స్.. ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో, అమ్మాయిల రాకుమారుడు.. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. అలాంటి హ్యాండమ్స్ హీరో ఇప్పుడు అసలు గుర్తు పట్టలేకుండా మారిపోయాడు. బాగా బక్క చిక్కి పోయి పండు ముసలిలాగా కనిపిస్తున్నాడు. అతనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు షాకవుతున్నారు.

Tollywood: అరే.. ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఏంటిలా మారిపోయాడు? షాక్‌లో ఫ్యాన్స్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor Jagapathi Babu
Basha Shek
|

Updated on: Feb 12, 2026 | 6:17 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ విలేజ్ స్పోర్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ఈ మెగా మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్ కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చికిరీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల కు పైగా వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. ఒక నెల ఆలస్యంగా ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే పెద్ది సినిమాకు సంబంధించి ఒక ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో పాటు ఒక టాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఎందుకంటే ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టడం కొంచెం కష్టమే.

ఇవి కూడా చదవండి

ఈ ఫొటోలో ఉన్న నటుడు ఒకప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరో. అమ్మాయిల ఫేవరెట్ యాక్టర్. అయితే కాలక్రమేణా హీరో చాన్సులు తగ్గిపోవడంతో ఇప్పుడు విలన్ గానూ, సహాయక నటుడిగానూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పెద్ది సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. మరి ఆ నటుడెవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. అతను మరెవరో కాదు జగపతి బాబు. పెద్ది మూవీలో ఆయన అప్పలసూరి అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

పెద్ది సినిమాలో జగపతిబాబు కొత్త లుక్..

ఇప్పుడు జగ్గూభాయ్ కు సంబంధించి మరో ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గురువారం (ఫిబ్రవరి 12) ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినిమా సెట్ లో బుచ్చిబాబుతో మాట్లాడుతున్న ఫోటో రిలీజ్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది జగపతి బాబేనా అని అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా కోసం ఇంతలా మారిపోవాలా? అంటూ జగ్గూబాయ్ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us