AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాశిఫలాలు ఏప్రిల్ 04, 2026: వారికి అదృష్టం తలుపు తడుతుంది..! మీ రాశికి ఇలా..

Horoscope Today (April 04, 2026): ఈ రోజు మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో ప్రగతి, శుభవార్తలు లభిస్తే, మరికొన్ని రాశుల వారు ఖర్చులు, ప్రయాణాలు, చిన్న సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద మంగళవారంనాడు పలు రాశుల వారికి కొత్త అవకాశాలు, లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి.

రాశిఫలాలు ఏప్రిల్ 04, 2026: వారికి అదృష్టం తలుపు తడుతుంది..! మీ రాశికి ఇలా..
Rashifal In Telugu 04 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 4, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు అందివస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగాల్లో అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి సంబంధమైన ఆదాయం చేతికి అందుతుంది. మిత్రుల సహాయ సహఃకారాలతో కొన్ని పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు అందివస్తాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొత్త ఆలోచనల్ని ఆచరణలో పెడతారు. స్థిరాస్తి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. ఆదాయానికి లోటుండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాన్ని విస్తరించడం గానీ, పెట్టుబడులు పెంచడం గానీ జరుగుతుంది. ధనాదాయం చాలావరకు బాగుంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, భూమి క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు, ఆటంకాలు కలిగినప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో శుభ వార్తలు అందుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. స్థిరా స్తికి సంబంధించిన క్రయవిక్రయాల్లో ఒప్పందాలు కుదర్చుకుంటారు. పితృ వర్గం నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అయి, కాస్తంత మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఒక ప్రధానమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు బాగా సంతృప్తికరంగా ఉంటాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గౌరవమర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పు వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమాచారం వింటారు.. పిల్లలకు శ్రమ తప్పకపోవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆశించిన కార్యసిద్ధి కలుగుతుంది.

Follow Us