AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: మరో హిందూ యువకుడి దారుణ హత్య.. తేయాకు తోటలో కాళ్లు చేతుకు కట్టేసి..!

ఒకవైపు బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతలో, సంచలన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. చంపారా ప్రాంతంలోని ఒక తేయాకు తోటలో ఒక హిందూ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని రతన్ సాహుకార్‌గా గుర్తించారు. స్థానికల మీడియా కథనాల ప్రకారం, అతను దారుణ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు.

Bangladesh: మరో హిందూ యువకుడి దారుణ హత్య.. తేయాకు తోటలో కాళ్లు చేతుకు కట్టేసి..!
Hindu Man Killed
Balaraju Goud
|

Updated on: Feb 12, 2026 | 10:09 AM

Share

ఒకవైపు బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతలో, సంచలన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. చంపారా ప్రాంతంలోని ఒక తేయాకు తోటలో ఒక హిందూ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని రతన్ సాహుకార్‌గా గుర్తించారు. స్థానికల మీడియా కథనాల ప్రకారం, అతను దారుణ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. రతన్ శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు సమాచారం. శరీరం రక్తంతో తడిసిపోయి, రెండు కాళ్ళు కట్టివేసి ఉన్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇటీవలే మరో హిందూ వ్యాపారవేత్త హత్య

బంగ్లాదేశ్‌లో ఇటీవలె ఒక హిందూ వ్యాపారవేత్త హత్యకు గురయ్యాడు. మైమెన్‌సింగ్ జిల్లాలోని త్రిశల్ ఉప జిల్లాలో, గుర్తు తెలియని దుండగులు 62 ఏళ్ల హిందూ వ్యాపారవేత్తను అతని సొంత దుకాణంలో పదునైన ఆయుధంతో దాడి చేసి చంపారు. ఆ వ్యాపారవేత్తను సౌత్‌కండ గ్రామానికి చెందిన సుసేన్ చంద్ర సర్కార్‌గా గుర్తించారు. అతనికి “భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజ్” అనే దుకాణం ఉంది. దుండగులు అతనిపై పదునైన ఆయుధంతో దాడి చేసి, దుకాణం లోపల మృతదేహాన్ని వదిలి షట్టర్లు మూసివేశారు. సుసేన్ చంద్ర సర్కార్ చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు అతని కోసం పలుచోట్ల వెతికారు. చివరికి షట్టర్లు తెరిచి చూడగా, అతను లోపల రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

డిసెంబర్ నుండి హిందువులపై పెరిగిన దాడులు

గత డిసెంబర్‌ నెలలో రాడికల్ యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ సంఘటనలు తీవ్రమయ్యాయి. 2025 డిసెంబర్‌లోనే 51 మత హింస సంఘటనలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం లక్ష్యంగా ఈ మారణకాండ కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా, వివిధ జిల్లాల్లో అనేక మంది హిందువులు హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో, నర్సిండి జిల్లాలోని ఒక గ్యారేజీలో నిద్రిస్తున్న 25 ఏళ్ల హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. ఈ కేసు అనుమానాస్పదంగా ఉందని, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

మరో సంఘటనలో, రాజ్‌బరి జిల్లాలో ఒక హిందూ పెట్రోల్ పంపు ఉద్యోగి మృతి చెందాడు. ఒక కస్టమర్ డబ్బు చెల్లించకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, తన వాహనంతో ఉద్యోగిపైకి దూసుకెళ్లాడని వార్తలు వచ్చాయి. పోలీసులు వాహన యజమాని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటనలో మత హింస ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!
ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!