Andhra Pradesh: పోటీ చేసేది నేనే..! వైసీపీ టికెట్‌ కోసం తండ్రీకొడుకుల పంచాయితీ.. పార్టీ శ్రేణుల్లో హైటెన్షన్..

అమలాపురం వైసీపీ టికెట్ విషయంలో తండ్రీకొడుకుల పంచాయితీ పీక్స్‌కి చేరినట్టే కనిపిస్తోంది. ఇన్‌ఛార్జ్‌గా తనకే బాధ్యతలు ఇచ్చారంటూ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ వివాదంపై తొలిసారిగా నోరు విప్పారు విశ్వరూప్‌.

Andhra Pradesh: పోటీ చేసేది నేనే..! వైసీపీ టికెట్‌ కోసం తండ్రీకొడుకుల పంచాయితీ.. పార్టీ శ్రేణుల్లో హైటెన్షన్..
YSRCP Party
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 31, 2023 | 1:18 PM

అమలాపురం వైసీపీ టికెట్ విషయంలో తండ్రీకొడుకుల పంచాయితీ పీక్స్‌కి చేరినట్టే కనిపిస్తోంది. ఇన్‌ఛార్జ్‌గా తనకే బాధ్యతలు ఇచ్చారంటూ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ వివాదంపై తొలిసారిగా నోరు విప్పారు విశ్వరూప్‌. డౌట్‌ లేదు.. తానే పోటీస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చారు. పనితీరును బట్టే టికెట్‌లు ఇస్తారని.. అమలాపురంలో పోటీ చేసేది తానేనంటూ పేర్కొన్నారు. 175 సీట్లు గెలవాలనేదే సీఎం జగన్ లక్ష్యంమని, ఎవరికైనా టికెట్‌ కాదంటే వారికి మరో రూపంలో పదవులు వస్తాయని విశ్వరూప్ పేర్కొ్న్నారు. ఈ టర్మ్‌ తనదేనంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

అధిష్టానం ఇప్పటికే మంత్రి తనయుడు శ్రీకాంత్ పేరును ఖరారు చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. అయితే, మంత్రి విశ్వరూప్ మాత్రం పోటీ చేసేది తానేనంటున్నారు. ఇది క్యాడర్‌ను కాస్త గందరగోళానికి గురి చేస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడడంతో.. శ్రీకాంత్‌ తీరుపై విశ్వరూప్‌ సన్నిహితులు, ముఖ్యనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శ్రీకాంత్‌కే టికెట్‌ ఇస్తే కనుక తాము ఇస్తే సహకరించేది లేదని విశ్వరూప్‌ వర్గం చెప్తోంది. అయితే, వీటిని పట్టించుకోకుండా కుమారుడు మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు.

కుటుంబంలో విభేదాల విషయం బయటకు రావడంతో విశ్వరూప్‌ ఆచితూచి మాట్లాడుతున్నారు. కుమారుడికి టికెట్‌ అనే విషయాన్ని ప్రస్తావించకుండా.. పోటీలో తానే ఉంటానంటూ చెప్తున్నారు. పెద్దాయనే పోటీలో ఉంటున్నారు కాబట్టి కన్‌ఫ్యూజన్‌ వద్దనేలా ఆయన క్యాడర్‌కి మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..