Srisailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. రత్నానంద స్వామి ఆశ్రమం వద్ద సంచారం..
జ్యోతిర్లింగము శక్తి పీఠము కొలువైన శ్రీశైలాన్ని చిరుతపులు వదలడం లేదు శ్రీశైలం శివారులే కేంద్రంగా తిరుగుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి రోజు వేలాదిమంది భక్తులు తరలివస్తుండటంతో చరిత్ర పులుల సంచారం ఆందోళన కలిగిస్తుంది అనేకసార్లు శ్రీశైలంలోకి వస్తున్నప్పటికీ నియంత్రించే చర్యలు ఏమాత్రం కనిపించడం లేదు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం రేపింది. రత్నానందస్వామి ఆశ్రమం హోమ గుండం వద్ద రాత్రి చిరుతపులి సంచరించింది. రాత్రుల సమయంలో చిరుత పులి స్దానికులకు యాత్రికులకు కనపడటంతో స్థానికులు భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం వద్ద ఉన్న గోన్న గోడపై చిరుతపులి రాత్రి హల్ చల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డులోని రుద్రా పార్క్ సమీపంలో గత రెండు నెలల కింద చిరుతపులి కనిపించింది. అయితే అప్పుడు అటవీశాఖ అధికారుల దీపావలి టపాసులు కాల్చి చప్పుడు చేయడంతో అది తిరిగి అడవిలోకి వెళ్లింది. అయితే రాత్రి మరల రత్నానందస్వామి ఆశ్రమం వద్ద చిరుతపులి ప్రత్యక్షమైంది. సుమారు గంటపాటు హోమగుండం వద్ద పడుకుని అటూ ఇటూ తిరుతున్న భక్తులను స్థానికులను గమనిస్తూ ఉంది.
చిరుతపులిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపటికి వాహనాలు తిరగటాన్ని గమనించిన చిరుతపులి దగ్గరలోని అడవిలోకి వెళ్లిపోయింది. యాత్రికులు చిరుతపులిని సెల్ ఫోను లలో చిత్రీకరించారు. చిరుతపులి పోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..