New Year 2024: తెలుగు ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన జగన్, బాబు, పవన్..
నూతన సంవత్సరం వేళ పలు రాజకీయ పార్టీల నాయకులు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్ తెలుపగా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగు ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్..
సీఎం జగన్..‘రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలి. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త విశ్వాసంతో.. అవినీతికి, అశాంతికి, అక్రమాలకు చోటులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేసేందుకు సంకల్పిద్దాం. మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకుందాం. ప్రతి తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి.. పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదాం. కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మరోసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్
ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 కొత్త ఉత్సాహం, సుఖసంతోషాలు అందించాలి. గత అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి. కొత్త ఏడాదిలో ప్రజల నిర్ణయం రాష్ట్రానికి మేలు కొలుపు కావాలి. ప్రజా నిర్ణయం రాష్ట్రాభివృద్ధి, శాంతిభద్రతలపై ప్రభావం చూపిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..