AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అరకులో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్..! సందర్శకుల సందడే సందడి..

ఆంధ్ర ఊటీలో అప్పుడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందడి మొదలైంది. అరకు లోయకు భారీగా సందర్శకుల రద్దీ పెరిగింది. ప్రకృతి ఒడిలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో.. నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు భారీగా చేరుకుంటున్నరు పర్యాటకులు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందడి చేస్తున్నారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో రూములన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. హోటల్ గదులు, క్యాంపింగ్ టెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది..

Follow us
Maqdood Husain Khaja

| Edited By: Srilakshmi C

Updated on: Dec 31, 2023 | 1:00 PM

అరకు, డిసెంబర్‌ 31: ఆంధ్ర ఊటీలో అప్పుడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందడి మొదలైంది. అరకు లోయకు భారీగా సందర్శకుల రద్దీ పెరిగింది. ప్రకృతి ఒడిలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో.. నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు భారీగా చేరుకుంటున్నరు పర్యాటకులు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందడి చేస్తున్నారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో రూములన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. హోటల్ గదులు, క్యాంపింగ్ టెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టూరిజం గెస్ట్ హౌస్ లకు ఫుల్ ఆక్యుపెన్సీలో ఉన్నాయి. అరకు రోడ్లు, పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. విదేశీయులు కూడా అరకు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

2023 ముగుస్తుంది.. 2014 ఆహ్వానం పలకాలి. కొత్త ఏడాదిని ఆహ్వానం పలకాలంటే డిఫరెంట్ ఎరెంజ్‌మెంట్స్ చేసుకుని వేడుకల్లో నిమగ్నమవుతుంటారు. ఇదంతా కామన్ గా ప్రతీ ఏటా జరుగుతుంది. కానీ.. కాస్త డిఫరెంట్‌గా జరుపుకోవాలని మరికొంత మంది సిద్ధమవుతారు. అదే.. పచ్చని ప్రకృతి ఒడిలో.. ఆహ్లాదమైన వాతావరణంలో ఆ ఘడియాల్లో ఉంటే..? ఆ క్షణాలను ఫ్రెండ్స్, ఫ్యామిలితో ఐటీ లాంటి క్లయిమేట్ లో గడిపితే.. అబ్బా..! ఆ మజా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలా ఆలోచించిన వారంతా అరకు వైపు చూస్తున్నారు. కూల్ క్లయిమేట్ కూడా న్యూ ఇయర్ వేల ప్రకృతి ప్రేమికుల దృష్టిని తమ వైపు తిప్పుకుంది అరకు.

ఆంధ్రా ఊటి అరకు ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. ఏజెన్సీలోని కూల్ క్లైమేట్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు పర్యాటకులు. న్యూ ఇయర్ ఘడియలను ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేందుకు ఏజెన్సీ వైపు తరలి వెళ్తున్నారు. కూల్ క్లైమేట్ కూడా తోడవడంతో.. ఇప్పటికే పర్యాటకులు భారీగా చేరుకొని మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. కెమెరాలో బంధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విదేశీ పర్యాటకులు సైతం..!

వీకెండ్‌తో పాటు ఇయర్ ఎండింగ్ కావడంతో.. అరకు తో పాటు ఏజెన్సీలోని పర్యటక ప్రాంతాలు.. రద్దీగా మారాయి. టూరిస్టులతో కిటకిట లాడుతున్నాయి. కూల్ క్లైమేట్ లో ఏజెన్సీ సోయగాలు మరింత పులకించడంతో వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. అరకులోయ సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడు తున్నాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిమిచ్చేందుకు అంతా సిద్ధమయ్యారు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విదేశీ టూరిస్టులు సైతం సందడి చేస్తున్నారు.

గదులకు ఫుల్ డిమాండ్..

మరోవైపు పర్యాటక రద్దీతో అరకులోయలోని హోటల్ గదులన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రభుత్వ, ప్రయివేటు అద్దె గదులు, హోటళ్లు పూర్తిగా నిండి పోయాయి. నెల రోజుల ముందు నుంచి రూముల కోసం సందర్శకులు ప్రయత్నాలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. మరోవైపు క్యాంపింగ్ టెంట్ లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. చాలామంది పర్యటకులకు అద్దె రూమ్స్ దొరక్క పోవడంతో తమ సొంత వాహనాలలోనే కాలక్షేపం చేస్తున్నారు. మరి కొంతమంది తిరుగు ప్రయాణం అవుతున్నారు.

పోలీసుల అలర్ట్.. ఎస్పీ సూచనలు..

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వంజంగి, అరకు, లంబసింగి, మారేడుమిల్లిసహా పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. 12 చోట్ల చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సందర్శకుల రద్దీ నేపథ్యంలో రోజు రాత్రిపూట కూడా ట్రైబల్ మ్యూజియం కు సందర్శకుల ఎంట్రీ కల్పిస్తున్నారు. అరకులో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.