New Year Celebrations 2024: తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై డేగకన్ను.. పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా!

నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్స్‌, గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించడంతోపాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిఘా బృందాలు మోహరించాయి. మొత్తం 50కిపైగా బృందాలను మఫ్టీల్లో విధుల్లోకి దింపినట్లు..

New Year Celebrations 2024: తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై డేగకన్ను.. పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా!
Traffic Advisory
Follow us

|

Updated on: Dec 29, 2023 | 10:00 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28: నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్స్‌, గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించడంతోపాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిఘా బృందాలు మోహరించాయి. మొత్తం 50కిపైగా బృందాలను మఫ్టీల్లో విధుల్లోకి దింపినట్లు ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వీరంతా జిల్లా కేంద్రాల్లోని బార్లు, రెస్టారెంట్లతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పబ్బుల్లో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్‌ వాడినా, అశ్లీల నృత్యాలు చేసినా, బార్లు, పబ్బుల్లోకి మైనర్లను అనుమతించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 20 బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. అక్రమ మద్యం నియంత్రణ కోసం రైళ్లలో తనిఖీలు చేపట్టేందుకు 13 బృందాలను మోహరించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు.. విమానాశ్రయాల్లోనూ పటిష్ఠ నిఘా పెట్టామని వివరించారు. తనిఖీలకు కేటాయించిన బృందాలతోపాటు రెగ్యులర్‌గా విధులు నిర్వర్తించే ఎక్సైజ్‌ అధికారులు 3 షిఫ్టుల్లో 24 గంటలూ విధుల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు వివరించారు.

వారికి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అనుమతి లేదు..

ఇవి కూడా చదవండి

రోడ్డు వినియోగదారుల భద్రత దృష్ట్యా ఆదివారం రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్‌ఎంవీలు), ప్యాసింజర్ వాహనాల రాకపోకలను ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అనుమతించబోమని రాచకొండ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ప్రత్యేక సమయాల్లో మధ్యస్థ, భారీ వస్తువుల వాహనాలు ORRలో వద్ద అనుమతించబడతాయని స్పష్టం చేశారు. కార్లు, ఇతర LMVలలో RGI విమానాశ్రయానికి ప్రయాణించే ప్రయాణీకులను కూడా ORR వద్ద అనుమతిస్తారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నాగోల్‌ ఫ్లైఓవర్‌, కామినేని ఫ్లైఓవర్‌, ఎల్‌బీ నగర్‌ ఫ్లైఓవర్‌, బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ (సాగర్‌ రింగ్‌ రోడ్‌) ఎల్‌బీ నగర్‌ అండర్‌ పాస్‌, చింతలకుంట అండర్‌ పాస్‌లను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్