Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barrelakka Complaint on RGV: ఆర్జీవీపై బర్రెలక్క ఫిర్యాదు.. మహిళా కమిషన్‌లో కేసు నమోదు!

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వ్యూహం సినిమాపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఈ మువీపై జనసేన, టీడీపీ నేతలు, ఆర్టీవీ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన నేత పవన్‌ను విమర్శించడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫేమస్‌ అయిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష పేరును..

Barrelakka Complaint on RGV: ఆర్జీవీపై బర్రెలక్క ఫిర్యాదు.. మహిళా కమిషన్‌లో కేసు నమోదు!
Barrelakka Complaint on RGV
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2023 | 9:07 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వ్యూహం సినిమాపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఈ మువీపై జనసేన, టీడీపీ నేతలు, ఆర్టీవీ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన నేత పవన్‌ను విమర్శించడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫేమస్‌ అయిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష పేరును వాడుకోవడం వివాదంగా మారింది. తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్క పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె తరపున లాయర్‌ రామ్‌ గోపాల్‌ వర్మపై గురువారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘వ్యూహం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ‘ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్‌ అయిపోయింది’.. అని ఆర్జీవీ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు.

‘నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు. అంతే కానీ మా ప్రాంత బిడ్డలను కించపరిచేలా మాట్లాడటం తప్పు లాయర్ మండిపడ్డారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని’ న్యాయవాది స్పష్టం చేశారు. కాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బర్రెలక్కకు భారీగానే మద్దతు పెరిగింది. నిరుద్యోగుల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి ఊహించని మద్దతు లభించింది. ఎన్నికల ఫలితాల్లో బర్రెలక్కకు ఏకంగా 5,754 ఓట్లు పోలయినట్లు ఈసీ వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్నారైలు, మాజీ ఐపీఎస్‌లు, పలువురు లాయర్లు, సినీ నటులు మద్దతు పలికారు.

మరోవైపు వ్యూహం సెన్సార్ సర్టి ఫికెట్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి డి నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వరరావు సంయుక్తంగా హై కోర్టులో దాఖాలు చేసిన రిట్‌ పిల్‌ను దాఖలు చేశారు. ఇక ఇప్పటికే చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యూహం సినిమాను తెరకెక్కించారని, ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని గురువారం విచారించిన రాష్ట్ర హైకోర్టు ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేశారు. అప్పటివరకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్ సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు జస్టిస్ సూరేపల్లి నంద పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.