Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొలం పనులు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన రైతు.. అక్కడికక్కడే మృతి!

పొలం పనులు చేస్తుండగా ఓ రైతు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం (డిసెంబర్‌ 28) జరిగింది. తంగళ్లపల్లికి చెందిన ఒగ్గు మల్లేశం (55) అనే రైతు రోజూ మాదిరిగానే వ్యవసాయం నిమిత్తం తన పొలానికి వెళ్లాడు. అక్కడ పొలం పనులు చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి..

Telangana: పొలం పనులు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన రైతు.. అక్కడికక్కడే మృతి!
Farmer Died Of Heart Attack
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2023 | 8:33 AM

సిరిసిల్ల, డిసెంబర్‌ 28: పొలం పనులు చేస్తుండగా ఓ రైతు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం (డిసెంబర్‌ 28) జరిగింది. తంగళ్లపల్లికి చెందిన ఒగ్గు మల్లేశం (55) అనే రైతు రోజూ మాదిరిగానే వ్యవసాయం నిమిత్తం తన పొలానికి వెళ్లాడు. అక్కడ పొలం పనులు చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి మల్లేశం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో సమీపంలోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మల్లేశం మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కాగా మృతుడికి భార్య పద్మ, ముగ్గురు కూతుళ్లు మౌనిక, సుశ్మిత, రశ్మిత ఉన్నారు. వీరిలో చిన్న కూతురు రశ్మిత గతంలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఓ ఆకతాయి ప్రేమ వేధింపులు తాళలేక ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేశంకి చెందిన గొర్రెలు, మేకలు కూడా గతంలో పిడుగు పడటంతో మృత్యువాత పడ్డాయి. ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.

అడవిలో అర్ధరాత్రి అడవి బిడ్డ ప్రసవ వేదన.. ‘రోడ్డెయ్యండి..సారూ!’

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీస బస్సు సౌకర్యాలు కూడా లేక మారుమూల గ్రామాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా నిండు గర్భిణీ అయిన ఓ గిరిజన మహిళ ఆసుపత్రికి చేరేమార్గం లేక అష్టకష్టాలు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మారుమూల రాళ్లాపురం అటవీ గ్రామానికి చెందిన నిండు గర్భిణి పొడియం పార్వతికి బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతొ ఆమె కుటుంబ సభ్యులు నిశీధిలోనే మంచంపై పార్వతిని కాలి నడకన రాళ్లాపురం నుంచి అడవిలో ప్రాజెక్టు సమీపంలోని 3 కి.మీ మేర ఉన్న ప్రధాన రహదారికి మోసుకొచ్చారు. అనంతరం ఆటోలో ఆమెను చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో గర్భిణికి వైద్యులు ప్రసవం చేయగా పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండటంతో గురువారం ఆమెను ఇంటికి పంపించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గోండీ ఆదివాసీలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.