TS Staff Nurse Results 2023: స్టాఫ్ నర్సు పోస్టుల మెరిట్ జాబితా విడుదల.. రేపట్నుంచి ధ్రువపత్రాల పరిశీలన
స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం (డిసెంబర్ 28) విడుదల చేశారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 18న విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు..
హైదరాబాద్, డిసెంబర్ 29: స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం (డిసెంబర్ 28) విడుదల చేశారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 18న విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినట్లు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి వివరించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ శనివారం (30వ తేదీ) నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రతి రోజూ 3 సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, మూడో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
వెరిఫికేషన్ ఎక్కడంటే..
ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 120/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావల్సి ఉంటుంది. అలాగే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్‌ను తమ వెంట తెచ్చుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ సమర్పించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
అలాగే ఈడబ్ల్యూఏఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా తీసుకురావాలి. స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసే వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్, అలాగే స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం విడుదల చేసింది ప్రొవిజినల్ జాబితా అని, అది తుది ఎంపిక జాబితా కాదని గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన వారిలో అనర్హులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.