APPSC Junior Lecturers Notification: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47 (క్యారీ ఫార్వర్డ్‌) లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంటర్‌ విద్యా శాఖ తరఫున విడుదల ఈ ప్రకటన వెలువరించింది. ఈ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు..

APPSC Junior Lecturers Notification: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే
APPSC Junior Lecturers Notification
Follow us

|

Updated on: Dec 29, 2023 | 1:11 PM

అమరావతి, డిసెంబర్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47 (క్యారీ ఫార్వర్డ్‌) లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంటర్‌ విద్యా శాఖ తరఫున విడుదల ఈ ప్రకటన వెలువరించింది. ఈ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

శాతవాహన యూనివర్సిటీ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్ష ఫీజు గడువు జనవరి 6

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఎంబీఏ, ఎంసీఏ (సీబీఎస్‌ఈ) మూడో సెమిస్టర్‌కు పరీక్ష ఫీజు చెల్లించడానికి జనవరి 6వ తేదీతో తుది గడువు ముగియనుంది. ఈ మేరకు శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎన్‌వీ శ్రీరంగప్రసాద్‌ డిసెంబరు 28న (గురువారం) ఓ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో జనవరి 10 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.

ఎస్‌ఎస్‌సీ పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. ఏ పరీక్ష ఏ రోజునంటే

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే వివిధ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది (2024) మే, జూన్‌లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలు జరగనున్నాయి. మే నెలలో ఎస్సై (దిల్లీ పోలీస్‌, సీఆర్‌పీఎఫ్‌) టైర్‌-1, జూన్‌లో జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌-1 రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మే, జూన్‌లో నిర్వహించే వివిద ఎస్‌ఎస్‌సీ నియామక రాత పరీక్షలు.. వాటి తేదీలు

  • సెలక్షన్‌ పోస్ట్ ఎగ్జామ్‌(ఫేజ్‌-XII) 2024 పేపర్‌-1(సీబీఈ) పరీక్ష మే 6, 7, 8 తేదీల్లో జరుగుతుంది.
  • గ్రేడ్‌ సి స్టెనో లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌ 2024 పేపర్‌-1 (సీబీఈ) మే 9వ తేదీన జరుగుతుంది.
  • జేఎస్‌ఏ/ ఎల్‌డీసీ గ్రేడ్‌ లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌ 2024 పేపర్‌-1 (సీబీఈ) మే 10వ తేదీన జరుగుతుంది.
  • ఎస్‌ఎస్‌ఏ/ యూల్‌డీసీ గ్రేడ్‌ లిమిటెడ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌ 2024 పేపర్‌-1 (సీబీఈ) మే 13వ తేదీన జరుగుతుంది.
  • ఎస్సై- దిల్లీ పోలీస్‌, సీఆర్‌పీఎఫ్‌ ఎగ్జామ్‌ 2024 టైర్‌-1 (సీబీఈ) మే 9,10,13 తేదీల్లో జరుగుతుంది.
  • జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌ 2024 పేపర్‌-1 (సీబీఈ) జూన్‌ 4,5,6 తేదీల్లో జరుగుతుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.