SSC Jobs: 26 వేలకిపైగా కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది.
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడగించబోమని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు.?
కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడగించబోమని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు.? అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 23,347 పురుషులు, 2,799 మహిళాల విభాగంలో ఖాళీలు ఉన్నాయి.
* విభాగాల విషయానికొస్తే.. బీఎస్‌ఎఫ్‌లో 6,174, సీఐఎస్‌ఎఫ్‌లో 11,025, సీఆర్‌పీఎఫ్‌లో 3337, ఎస్‌ఎస్‌బీలో 635, ఐటీబీపీలో 3189, ఏఆర్‌లో 1490, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 296 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పీఈటీ/పీఎస్‌టీ/ వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే-లెవెల్ 3 కింద రూ.21,700 నుంచి 69,100 వరకు వేతనం అందజేస్తారు.
* ఇక అభ్యర్థుల వయసు జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 23 ఏళ్లు మించరాదు.
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్ వర్గాలకు చెందినవారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
* తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షను ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించనున్నారు. ఇక పరీక్షను ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..