Success Story: అణచివేత నుంచి అందనంత ఎత్తుకు.. ఈమె రియల్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’..

అత్తింటి వేధింపులతో ఆత్మహత్య వరకూ వెళ్లిన ఆమె.. ఆ తర్వాత చిన్న ఉద్యోగంలో చేరి, తర్వాత బిజినెస్ ప్రారంభించి, ఇప్పుడు వందల కోట్లకు అధిపతిగా అవతరించింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ వ్యాపార వేత్త, టెడ్ఎక్స్(TEDx) స్పీకర్ కల్పనా సరోజ్. ప్రస్తుతం కమానీ ట్యూబ్స్ లిమిటెడ్‌లో చైర్‌పర్సన్‌గా ఉన్న ఈమె జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. అనేకమంది ఆదర్శనీయం. కల్పనా సరోజ్ విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం..

Success Story: అణచివేత నుంచి అందనంత ఎత్తుకు.. ఈమె రియల్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’..
Entrepreneur Kalpana Saroj
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 28, 2023 | 6:00 PM

మనలో చాలా మంది ఆస్కార్ అవార్డు గెలుచుకున్న స్లమ్ డాగ్ మిలీయనీర్ సినిమా చూసే ఉంటారు. దానిలో మురికి వాడలో ఉండే ఓ కుర్రాడు కోటీశ్వరుడు అవడం చాలా బాగుంటుంది. అయితే అది సినిమా అదంతా డ్రామా. అయితే నిజ జీవితంలో ఓ మహిళ అంతటి ఘన కార్యాన్ని ఎన్నో పోరాటాలతో నిజం చేసి చూపించింది. అత్తింటి వేధింపులతో ఆత్మహత్య వరకూ వెళ్లిన ఆమె.. ఆ తర్వాత చిన్న ఉద్యోగంలో చేరి, తర్వాత బిజినెస్ ప్రారంభించి, ఇప్పుడు రూ. కోట్లకు అధిపతిగా అవతరించింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ వ్యాపార వేత్త, టెడ్ఎక్స్(TEDx) స్పీకర్ కల్పనా సరోజ్. ప్రస్తుతం కమానీ ట్యూబ్స్ లిమిటెడ్‌లో చైర్‌పర్సన్‌గా ఉన్న ఈమె జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. అనేకమంది అనుసరణీయం. కల్పనా సరోజ్ విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం..

కల్పనా గతం అంధకారం..

మహారాష్ట్రలోని అకోలాకు చెందిన కల్పన జీవితంలో సవాళ్లను ఎదుర్కొంది. ఆమె తండ్రి, పోలీసు కానిస్టేబుల్. అయితే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమె 12 ఏళ్ల వయస్సులోనే ముంబైలోని మురికివాడలలో నివసించే ఓ వ్యక్తితో వివాహం చేశారు. ఆ జీవితం ఆమెకు నరకకూపంగా మారింది. భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. మానసిక, శారీరక వేధింపులను తాళలేకపోయింది. ఈ అణచివేత పరిస్థితి నుండి బయటపడాలని నిశ్చయించుకున్న కల్పన తన తండ్రి సాయంతో అక్కడి నుంచి బయటపడింది. అత్తవారింటి నుంచి వచ్చేసిందని, తన గ్రామంలోకి తిరిగి రానివ్వలేదు. సంఘ బహిష్కరణ చేశారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే అదృష్టం బాగుండి బయటపడింది.

కొత్త అడుగులు ఇలా..

ఇక గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటే ముందుకు సాగలేమని తనకు తాను ధైర్యం చెప్పుకొని కొత్త జీవితం వైపు అడుగులేసింది. మొదటిగా నెలకు రూ. 60 జీతానికి ఓ సంస్థలు పనికి చేరింది. ఆ తర్వాత మరో రూ.100 అదనంగా సంపాదించడం ప్రారంభించింది. అప్పటికీ నిరంతరం శ్రమిస్తూనే .. కొత్త ఆలోచనలు చేసింది. ప్రభుత్వ సాయంతో సొంతంగా ఓ బొటిక్ ను ప్రారంభించింది. తర్వాత కేఎస్ ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించింది. పరిచయాలను పెంచుకొని, రియల్ ఎస్టేట్ వెంచర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత నష్టాల్లో ఉన్న కమనీ ట్యూబ్స్ లిమిటెడ్‌లో చేరి.. ఆమె వ్యవస్థాపక చతురత, వ్యూహాత్మక దృష్టి కారణంగా లాభాల్లోకి తెచ్చింది. ఇది ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

పద్మశ్రీ పురస్కారం..

ప్రస్తుతం ఆమె కమానీ ట్యూబ్స్ లిమిటెడ్‌లో చైర్‌పర్సన్‌గా ప్రతిష్టాత్మకమైన పదవిని కలిగి ఉండటమే కాకుండా విశేషమైన వ్యక్తిగత సంపదను కలిగి ఉంది. ఆమె మొత్తం ఆస్తులు రూ. 917 కోట్ల వరకూ ఉన్నాయి. ఆమెకు 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అచెంచల విశ్వాసం, పట్టుదల, దానికి తగిన కృషి కలగలిపిన నిలువెత్తు స్ఫూర్తి కల్పనా సరోజ్. ఈమె కథ అందరూ తెలుసుకోవాల్సిన నిజ జీవిత గాథ.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.