TS MHSRB Staff Nurse Merit List 2023: మరికాసేపట్లో విడుదలకానున్న తెలంగాణ స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్ జాబితా
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) డిసెంబరు 28 (గురువారం) విడుదల చేయనుంది. స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన బోర్డు ఇటీవల మార్కులు వెల్లడించింది. ఫలితాలపై అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 9,000మందితో కూడిన మెరిట్ జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఈ రోజు విడుదల..
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) డిసెంబరు 28 (గురువారం) విడుదల చేయనుంది. స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన బోర్డు ఇటీవల మార్కులు వెల్లడించింది. ఫలితాలపై అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 9,000మందితో కూడిన మెరిట్ జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఈ రోజు విడుదల చేయనుంది. మెరిట్ జాబితా విడుదలైన తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 29 నుంచి ప్రారంభం కానుంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 7,094 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరయ్యారు. రాతపరీక్షలో సాధించిన మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించనున్నారు. ద్రువపత్రాల పరిశీలన అనంతరం తుది జాబితా వెలువడనుంది.
21 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 30వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మొత్తం 21 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్/ మెకానికల్/ కెమికల్/ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు జులై 01, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిబ్రవరి 19, 2024వ తేదీ వరకు అన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తు రుసుము కింద రూ.370, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు…
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 30,2024.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2024.
- రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.