APPSC Group 1 Online Application: జనవరి 1 నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (12/2023) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తులను జనవరి 1 నుంచి స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. డిసెంబ‌రు 8న జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 21 వరకు స్వీకరిస్తామని వెల్లడించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన..

APPSC Group 1 Online Application: జనవరి 1 నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే
APPSC Group 1
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 28, 2023 | 12:54 PM

అమరావతి, డిసెంబర్‌ 28: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (12/2023) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తులను జనవరి 1 నుంచి స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. డిసెంబ‌రు 8న జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 21 వరకు స్వీకరిస్తామని వెల్లడించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్లు డిసెంబ‌రు 27న‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌ ఏహెచ్‌ఏ రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. డిసెంబర్‌ 31న పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్‌ 31న రాత పరీక్ష జరుగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయక (ఏహెచ్‌ఏ) పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకు వేతనం చెల్లిస్తారు.

మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం పది, ఇంటర్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఉంటాయన్నారు. ప్రాక్టికల్స్‌ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కొనసాగుతాయన్నారు. పరీక్ష ఫీజును జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19వరకు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్‌కు రూ.1000, పదో తరగతికి రూ.500తోపాటు సబ్జెక్టులకు నిర్దేశించిన పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.