CUET PG 2024: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే

సీయూఈటీ (పీజీ) -2024 షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. కామన్‌ యూనివర్సిటీ ఎన్‌ట్రన్స్‌ టెస్ట్ పీజీ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారం (డిసెంబర్ 26) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సీయూఈటీ ప్రవేశ పరీక్షలు 2024 మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తన ప్రకటనలో..

CUET PG 2024: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే
CUET PG 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 28, 2023 | 9:08 AM

ఢిల్లీ, డిసెంబర్‌ 28: సీయూఈటీ (పీజీ) -2024 షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. కామన్‌ యూనివర్సిటీ ఎన్‌ట్రన్స్‌ టెస్ట్ పీజీ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారం (డిసెంబర్ 26) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సీయూఈటీ ప్రవేశ పరీక్షలు 2024 మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తన ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 24 రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

దేశవ్యాప్తంగా 195 సెంట్రల్‌, స్టేట్‌, ప్రైవేట్‌, డీమ్డ్‌ వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలను సీయూఈటీ ర్యాంకు ద్వారా భర్తీచేస్తారు. వివరాలకు https://nta.ac.in, https:// pgcuet.samarth.ac.in వెబ్‌సైట్లను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. ఈ ఏడాది సీయూఈటీ పీజీలో కొన్ని కీలక మార్పులు చేశారు. గతేడాది సీయూఈటీ -పీజీ పరీక్షను రెండు గంటల పాటు నిర్వహించగా, ఈసారి 1 గంట 45 నిమిషాలకు కుదించారు. పరీక్షలో మొత్తం ప్రశ్నల సంఖ్యను కూడా 100 నుంచి 75కి తగ్గించారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఇతర సందేహాల కోసం హెల్ప్‌ డెస్క్‌ నెంబర్ 011 4075 9000కు ఫోన్‌ చేయవచ్చు. లేదా cuet-pg@nta.ac.in.కు ఈమెయిల్‌ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేదీ: డిసెంబర్ 26, 2023.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: జనవరి 24, 2024.
  • ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు గడువు: జనవరి 25 వరకు, 2024.
  • దరఖాస్తుల్లో తప్పుల సవరణ తేదీలు: జనవరి 27 నుంచి 29 వరకు
  • అడ్వాన్స్‌డ్ సిటీ ఇన్ఫర్మేషన్‌ వెల్లడి: మార్చి 4, 2024.
  • అడ్మిట్‌ కార్డులు విడుదల తేదీ: మార్చి 7 నుంచి
  • పరీక్ష తేదీలు: మార్చి 11 నుంచి 28 వరకు
  • ఆన్సర్‌ కీపై అభ్యంతరాల స్వీకరణకు గడువు: ఏప్రిల్ 4, 2024.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.