TS Eamcet 2024 Exam Date: మే రెండో వారంలో తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్షలు.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్!
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) నుంచి త్వరలో ప్రకటన వెలువడనుంది. తొలుత ఎంసెట్‌తో సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటిస్తారు. ఆ తర్వాత EAMCET, ICET, PGECET, EdCET, LAWCET వంటి వివిధ ప్రవేశ పరీక్షలకు కన్వీనర్‌లను కౌన్సిల్ నియమిస్తుంది. ఇందుకు సంబంధించిన..
హైదరాబాద్, డిసెంబర్ 28: టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) నుంచి త్వరలో ప్రకటన వెలువడనుంది. తొలుత ఎంసెట్‌తో సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటిస్తారు. ఆ తర్వాత EAMCET, ICET, PGECET, EdCET, LAWCET వంటి వివిధ ప్రవేశ పరీక్షలకు కన్వీనర్‌లను కౌన్సిల్ నియమిస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. బుధవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎంసెట్ సహా పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్ సెక్రటరీకి అధికారులు వివిధ సీఈటీలు, వాటి నిర్వహణలో ఉన్న ప్రక్రియ గురించి వివరించారు. ఏప్రిల్/మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాధ్యమయ్యే తేదీలపైనా చర్చించారు. ఎన్నికల తేదీలతో JEE, NEET వంటి ఇతర జాతీయ పోటీ పరీక్షల తేదీలతో విభేదించకుండా సెట్‌ల తేదీలు ఖరారు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. జేఈఈ, నీట్ వంటి జాతీయ ఇతర పరీక్షల తేదీలను మినహాయించి ఎంసెట్‌తోపాటు, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, ఈసెట్ వంటి పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేయనున్నారు.
కాగా గతేడాది ఎంసెట్ 2023 ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 2,05,351 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో పరీక్షకు 1,95,275 మంది హాజరయ్యారు.1,56,879 మంది అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 1,15,332 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,06,514 మంది హాజరయ్యారు. 91,935 మంది అర్హత సాధించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.