AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కదులుతున్న కారుపై నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు.. పట్టించుకోని డ్రైవర్‌! వీడియో వైరల్

కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు కారుపై నిద్రిస్తున్నారని కారు డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు వారించినా బేఖాతరు చేయకపోవడం గమనార్హం. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తి బాధ్యతారహిత్యంపై మండిపడుతున్నారు. డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన గోవాలో చోటు చేసుకుంది. గోవాలోని మాపుసా పట్టణ సమీపంలో..

Viral Video: కదులుతున్న కారుపై నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు.. పట్టించుకోని డ్రైవర్‌! వీడియో వైరల్
Kids Sleeping On Moving Car
Srilakshmi C
|

Updated on: Dec 29, 2023 | 8:05 AM

Share

పణజీ, డిసెంబర్‌ 29: కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు కారుపై నిద్రిస్తున్నారని కారు డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు వారించినా బేఖాతరు చేయకపోవడం గమనార్హం. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తి బాధ్యతారహిత్యంపై మండిపడుతున్నారు. డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన గోవాలో చోటు చేసుకుంది. గోవాలోని మాపుసా పట్టణ సమీపంలో కదులుతున్న ఓ కారుపై ఇద్దరు చిన్నారులు ప్రమాదకర రీతిలో నిద్రిస్తూ కనిపించారు. పర్రా గ్రామంలో బుధవారం ఓ టూరిస్టు వాహనంలో వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

కదులుతున్న XUV కారుపై భాగంలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తూ కనిపించారు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కారుపై చిన్నారులు పడుకొని ఉండటంపై.. వీడియో తీస్తున్న వ్యక్తి డ్రైవర్‌ను ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పకుండా డ్రైవింగ్‌ను కొనసాగిస్తూ ముందుకు వెళ్లిపోయాడు. వెళ్లిపోవడం గమనార్హం. ఈ వీడియో డిసెంబర్‌ 27న పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో సదరు టూరిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం విచారకరం. రిలాక్స్ అవడానికి గోవాకి వచ్చారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా.. ఇది పిల్లలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. సాధారణంగా అనిపించినా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలంటూ ఓ యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై పోలీసులు సుమోటోగా చర్య తీసుకోవాలని మరొక యూజర్‌ డిమండ్‌ చేశారు. దీనిపై విచారణ జరిపి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు గోవా పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి మాపుసా పోలీసులు కారు నిడిపన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌