AP AHA Answer Key: పశుసంవర్ధక సహాయకుల పోస్టుల రాత పరీక్ష ఆన్సర్ ‘కీ’ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల నియామక పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. కీపై అభ్యంతరాలను జనవరి 3వ తేదీలోగా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ తెల్పింది. త్వరలో ఫలితాలు వెల్లడిస్తామని, ఫలితాలతో పాటు తుది కీ కూడా వెల్లడి చేస్తామని పేర్కొంది. పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు డిసెంబర్ 31న పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్..
అమరావతి, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల నియామక పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. కీపై అభ్యంతరాలను జనవరి 3వ తేదీలోగా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ తెల్పింది. త్వరలో ఫలితాలు వెల్లడిస్తామని, ఫలితాలతో పాటు తుది కీ కూడా వెల్లడి చేస్తామని పేర్కొంది. పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు డిసెంబర్ 31న పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 1,896 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (ఏహెచ్‌ఏ) పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాత పరీక్షలో ప్రతిభకనబరచిన అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి.
పంచాయతీరాజ్‌శాఖలో కొత్తగా 26 డీడీఓ పోస్టులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్‌శాఖలో అదనంగా 26 డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ) పోస్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జనవరి1) ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో 51 డీడీఓ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున డీడీఓని నియమించింది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 26కి పెంచడంతో, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 77కి చేరింది. దీంతో కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లు పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, చింతూరు, భీమునిపట్నం, తాడేపల్లిగూడెం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, రేపల్లె, సత్తెనపల్లి, కనిగిరి, పత్తికొండ, ఆత్మకూరు, డోన్, గుంతకల్, పుట్టపర్తి, బద్వేల్, పులివెందుల, రాయచోటి, నగరి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి కేంద్రాలకు డీడీఓ పోస్టులను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గేట్-2024 అడ్మిట్ కార్డులు విడుదల
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2024) పరీక్ష అడ్మిట్ కార్డులు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది దాదాపు 8 లక్షలకు పైగా విద్యార్ధులు గేట్ పరీక్ష రాయనున్నారు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.