Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: నేను రామ భక్తుడిని.. రాంనగర్‌లో రామోత్సవం జరుపుతానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్

స్వతహాగా చిన్న తనం నుంచి తాను రామ భక్తుడన్న ఇక్బాల్ చిన్న తనం నుంచి సమస్త దేవతలను ఆరాధిస్తున్నానని.. తన చిన్నప్పటి నుండి అన్ని దేవుళ్ళను పూజించానని చెప్పారు. రామపూజ కూడా చేస్తానని స్పష్టం చేశారు. రామమందిర అంశంతో ప్రజలను విభజించి ఎవరైనా  రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు.. అయితే తాను ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం లేదని ..  కొందరు రాముడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Ayodhya: నేను రామ భక్తుడిని.. రాంనగర్‌లో రామోత్సవం జరుపుతానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్
Mla Iqbal Hussain
Follow us
Surya Kala

|

Updated on: Jan 05, 2024 | 9:47 AM

500 ఏళ్ల నిరీక్షణకు తెర పడే సమయం ఆసన్నం అవుతోంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ శుభ సమయం కోసం ఓ వైపు కోట్లాది హిందువులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయి తే ఇప్పుడు కర్ణాటక రాంనగర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. చన్నపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాముడు తమ కుటుంబం ఆరాధ్య దైవం అని.. తాను రామ భక్తుడని.. తాను రాముడిని పూజిస్తాన చెప్పారు. అంతేకాదు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ సమయంలో రాంనగర్‌లో రామోత్సవాలు జరపాలని అనుకుంటున్నామని.. ఈ ఉత్సవాలను భక్తితో చేస్తామని చెప్పారు.

స్వతహాగా చిన్న తనం నుంచి తాను రామ భక్తుడన్న ఇక్బాల్ చిన్న తనం నుంచి సమస్త దేవతలను ఆరాధిస్తున్నానని.. తన చిన్నప్పటి నుండి అన్ని దేవుళ్ళను పూజించానని చెప్పారు. రామపూజ కూడా చేస్తానని స్పష్టం చేశారు. రామమందిర అంశంతో ప్రజలను విభజించి ఎవరైనా  రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు.. అయితే తాను ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం లేదని ..  కొందరు రాముడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి సొంత నిబద్ధత, సిద్ధాంతాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసమే ఇలా చేస్తున్నారో లేదో తెలియదు. అది వారి ఇష్టం. కానీ మనం రాముడిని ఇలవేల్పుగా పూజిస్తాం. రామారాధన వారికి కొత్త కావచ్చు కానీ మనకు కొత్త కాదు. దీన్ని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఇక్బాల్ హుస్సేన్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ఓ వైపు రామమందిర ప్రారంభోత్సవానికి విపక్ష నేతలను, సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల నేతలను సైతం ఆహ్వానించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. అలాగే ఆహ్వానం అంశం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించినదని బీజేపీ స్పష్టం చేసింది.

మరోవైపు హుబ్లీలో కరసేవకుల అరెస్టుపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. రామభక్తులపై సిద్ధరామయ్య ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య ఇక్బాల్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..