Yadagirigutta: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం.. 28 రోజుల్లో రూ.3.15 కోట్లు

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. 28 రోజులకు గానూ ఆలయ హుండీ ద్వారా రికార్డుస్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 28 సాధారణ రోజుల్లో..

Yadagirigutta: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం.. 28 రోజుల్లో రూ.3.15 కోట్లు
Yadadri Lakshminarasimhaswamy Temple
Follow us
M Revan Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Jan 05, 2024 | 8:37 AM

యాదాద్రి, జనవరి 5: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. 28 రోజులకు గానూ ఆలయ హుండీ ద్వారా రికార్డుస్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 28 సాధారణ రోజుల్లో ఆలయ ఖజానాకు హుండీ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 10 నుంచి 20 వేల మంది, సెలవు దినాల్లో 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గత 28 సాధారణ రోజుల్లో ఆలయ హుండీల ద్వారా రికార్డుస్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను కొండ కింద ఆధ్యాత్మికవాడ లోని శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు.

నగదు రూ.3,15,05,035, బంగారం 100 గ్రాములు, వెండి 4,250 గ్రాములు నగల రూపంలో సమకూరినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, యూఏఈ, బ్రిటన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, మలేసియా, నేపాల్‌, ఖతార్‌, థాయిలాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల నగదు (కరెన్సీ) కూడా హుండీల ద్వారా లభించింది. గతంలో నగదు ఆదాయం రూ.2.5 కోట్లు రాగా ఈసారి రూ.3.15 కోట్లు రావడం విశేషమని ఈవో తెలిపారు. ఇది ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డుగా అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..