Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: సైబర్ నేరాల్లో ఆరితేరిన కేటుగాడు.. దేశవ్యాప్తంగా 277 సైబర్ నేరాల కేసులో ప్రధాన నిందితుడు

దేశంలోనే సైబర్ నేరాల్లో ఆరితేరిన కేటుగాడిని సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇప్పటికే అనేక సైబర్ నేరాల్లో నిందితుడిగా ఉంటూ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు జితేందర్ సింగ్. సంగారెడ్డి జిల్లాలోనూ కేసులు ఉండటంతో కోర్టులో హాజరుపర్చి తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తుడిని సంగారెడ్డి జిల్లా కోర్టుకి..

Cyber Crime: సైబర్ నేరాల్లో ఆరితేరిన కేటుగాడు.. దేశవ్యాప్తంగా 277 సైబర్ నేరాల కేసులో ప్రధాన నిందితుడు
Jitender Singh
Follow us
P Shivteja

| Edited By: Srilakshmi C

Updated on: Jan 05, 2024 | 9:30 AM

యాదాద్రి, జనవరి 5: దేశంలోనే సైబర్ నేరాల్లో ఆరితేరిన కేటుగాడిని సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇప్పటికే అనేక సైబర్ నేరాల్లో నిందితుడిగా ఉంటూ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు జితేందర్ సింగ్. సంగారెడ్డి జిల్లాలోనూ కేసులు ఉండటంతో కోర్టులో హాజరుపర్చి తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తుడిని సంగారెడ్డి జిల్లా కోర్టుకి సైబర్ క్రైం పోలీసులు తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా 277 సైబర్ నేరాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు జితేందర్ సింగ్. తెలంగాణలోను 84 కేసుల్లో నిందితుడిగా ఉండగా సంగారెడ్డి జిల్లాలో బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి మొత్తం ఐదు సైబర్ కేసుల్లో నిందితుడు జితేందర్ సింగ్.

దీంతో పీటీవారెంట్ పై చర్లపల్లి జైలు నుంచి సంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు జిల్లా న్యాయస్థానంలో జడ్జి ముందు నిందితున్ని ప్రవేశపెట్టారు.కర్ణాటక రాష్టం బెంగళూరులోని జేపీ నగర్ కు చెందిన జితేందర్ సింగ్ వయసు ముప్పై ఏళ్ళు. అమాయక ప్రజల్ని అధికాడబ్బు ఆశ చూపిస్తూ బురిడీ కొట్టించేవాడు. జాబ్స్, లోన్స్, ఆన్ లైన్ గేమ్స్ అంటూ సైబర్ మోసాలకు పాల్పడి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేవాడు ఈ ఘనుడు. అందుకోసం 60 మొబైల్ ఫోన్లు, 63 సిమ్ములు, 13 బ్యాంక్ అకౌంట్లని వినియోగించి సైబర్ నేరాలు చేస్తున్నాడు జితేందర్ సింగ్. జనాలు కూడా ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడి ఇతడి చేతిలో మోసపోయారు.

అయితే సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడు జితేందర్ సింగ్ ని గతంలోనే అరెస్ట్ చేయగా ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.. సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేరాలు మాత్రం ఆగడం లేదు. మరో వైపు సంగారెడ్డి జిల్లాలో భారీగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. 2021 ఏడాదిలో 32 సైబర్ కేసులు నమోదుకాగా 2023లో ఆ సంఖ్య 323 కు చేరింది. అంటే రెండేళ్లలో పదింతలు కేసులు పెరిగాయి. అయితే ఈజీమనీకి ఆశపడి ఉన్న డబ్బు పొగుట్టుకోవద్దని పోలీసులు పదే పదే సూచిస్తున్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్ కి కాల్ చేస్తే డబ్బును తిరిగిపొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.