Car Accident: పెళ్లి బృందంపైకి కారు ఎక్కించిన కిరాతకుడు! ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు

పాత కక్షల నేపథ్యంలో పెళ్లి బృందంపై కారుతో దాడి చేయగా ఒక బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి వడ్డెర కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉప్పు వెంకటి అనే వ్యక్తి తన కుమార్తె సువర్ణ వివాహాన్ని గురువారం నిర్వహించారు.. ఉదయం వివాహం పూర్తి కాగా రాత్రి తన కూతురు సువర్ణను అత్తారింటికి సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించి, పెళ్లి బృందం తిరిగి ఇంటికి వస్తున్న..

Car Accident: పెళ్లి బృందంపైకి కారు ఎక్కించిన కిరాతకుడు! ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
Woman Died In Wedding Party
Follow us
P Shivteja

| Edited By: Srilakshmi C

Updated on: Jan 05, 2024 | 10:24 AM

మెదక్‌, జనవరి 5: పాత కక్షల నేపథ్యంలో పెళ్లి బృందంపై కారుతో దాడి చేయగా ఒక బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి వడ్డెర కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉప్పు వెంకటి అనే వ్యక్తి తన కుమార్తె సువర్ణ వివాహాన్ని గురువారం నిర్వహించారు.. ఉదయం వివాహం పూర్తి కాగా రాత్రి తన కూతురు సువర్ణను అత్తారింటికి సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించి, పెళ్లి బృందం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన ఉప్పు నరేందర్ అనే వ్యక్తి కారుతో అతివేగంగా వచ్చి పెళ్లి బృందం పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు.

ఈ ఘటనలో ఉప్పు రమ్య, ఉప్పు దుర్గయ్య, సంపంగి యాదగిరి, ఉప్పు సుజాత, బబులు అనే వ్యక్తులకు గాయాలు కాగా, ఉప్పు రమ్య, దుర్గయ్యల పరిస్థితి విషమంగా మారింది. వీరిని బంధువులు ఆసుపత్రికి తరలించగా రమ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే గత కొద్దీ రోజులుగా ఉప్పు నరేందర్, ఉప్పు వెంకటి మధ్య భూ వివాదం ఉందని, అది మనసులో పెట్టుకున్న నరేందర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా నేడు రెడ్డిపల్లిలోని వడ్డెర కాలనీలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

గత రాత్రి పాత కక్షలు నేపథ్యంలో పెళ్లి బృందంపై ఉప్పు నరేందర్ అనే వ్యక్తి కారుతో దాడి చేయడంతో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఒక యువతి చికిత్స పొందుతున్న మృతి చెందింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న రామాయంపేట సిఐ లక్ష్మీ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటనలో ఉప్పు నరేందర్ కారును స్థానికులు ధ్వంసం చేశారు. నరేందర్ అక్కడి నుండి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నరేందర్ కోసం వెతుకు తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.