Telangana: విద్యార్ధులకు తగ్గనున్న బ్యాగుల మోత.. విద్యాశాఖ కీలక నిర్ణయం! రాష్ట్ర ప్రభుత్వం ఎదుట ప్రతిపాదన

ఇకపై పాఠశాలలకు వెళ్లడం విద్యార్థులకు భారం కాదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బ్యాగుల మోత కనీసం 25 శాతం మేర తేలికకానుంది. ఎదుగుతున్న పిల్లలు బరువైన స్కూల్ బ్యాగులను భుజాలపై మోయలేక ఇబ్బంది పడుతున్నారని వస్తున్న ఆందోళనలపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు పాఠ్యపుస్తకాలలోని కాగితపు మందాన్ని తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయించింది..

Telangana: విద్యార్ధులకు తగ్గనున్న బ్యాగుల మోత.. విద్యాశాఖ కీలక నిర్ణయం! రాష్ట్ర ప్రభుత్వం ఎదుట ప్రతిపాదన
 school Bags
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2024 | 4:26 PM

హైదరాబాద్, జనవరి 8: ఇకపై పాఠశాలలకు వెళ్లడం విద్యార్థులకు భారం కాదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బ్యాగుల మోత కనీసం 25 శాతం మేర తేలికకానుంది. ఎదుగుతున్న పిల్లలు బరువైన స్కూల్ బ్యాగులను భుజాలపై మోయలేక ఇబ్బంది పడుతున్నారని వస్తున్న ఆందోళనలపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు పాఠ్యపుస్తకాలలోని కాగితపు మందాన్ని తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠ్యపుస్తకాల పేపర్ మందం చదరపు మీటరుకు 90 గ్రాముల (GSM) నుంచి 70 GMSకి తగ్గించాలని నిర్ణయించింది. ఫలితంగా పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతానికి తగ్గి స్కూల్ బ్యాగ్‌ల బరువు తేలికవుతాయి.

గతేడాది రూ.150 కోట్లు ఖర్చు..

ప్రస్తుతం 4.5 కిలోల బరువున్న పదవ తరగతి పాఠ్యపుస్తకాలు పేపర్ మందం తగ్గిన తర్వాత ఒక కిలో మేర తగ్గుతాయని ప్రాథమిక అంచన. పిల్లలపై భారాన్ని తగ్గించడమే కాకుండా, ప్రస్తుతం ముడి పేపర్ సేకరణ 11,000 టన్నుల నుంచి 8,000 టన్నులకు తగ్గనుంది. దీంతో కాగితం కొనుగోళ్లపై విద్యాశాఖ పెద్ద మొత్తంలో ఆదా చేసేందుకు అవకాశం కలిగింది. దీని వల్ల విద్యాశాఖకు రూ. 30 నుంచి రూ. 40 కోట్లు ఆదా అవ్వనుంది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందించడానికి విద్యాశాఖ రూ.150 కోట్లు ఖర్చు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఎదుట ప్రతిపాదన

2024 – 25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని 24.66 లక్షల మంది విద్యార్థులకు ఉచిత కాంపోనెంట్‌ కింద 2 కోట్ల పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. స్కూల్ బ్యాగ్ లోడ్, ఖర్చు తగ్గించేందుకు ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ ఎదుట ఉంచినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం అనుమతి తెలిపితే విద్యార్ధుల పాఠ్యపుస్తకాల బరువు తగ్గుతుందని, పర్యావరణానికి ఇది మేలు చేస్తుందని అన్నారు. టన్నుల కొద్దీ ముడి కాగితపు పదార్థాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణంపై ఇది ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే