Hrithik Roshan Birthday : వేలకోట్లకు అధిపతి ఈ స్టార్ హీరో.. హృతిక్ రోషన్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

హృతిక్ రోషన్ 12 ఏళ్ల వయస్సులో తన సినీ జర్నీని ప్రారంభించాడు. రజనీకాంత్ నటించిన 'భగవాన్ దాదా' చిత్రంలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఈ సినిమాలో అతని తండ్రి రాకేష్ రోషన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి హృతిక్ తాత జె. ఓం ప్రకాష్ దర్శకత్వం వహించారు. అనతి కాలంలోనే హృతిక్ రోషన్ స్టార్ హీరోగా ఎదిగాడు.

Hrithik Roshan Birthday : వేలకోట్లకు అధిపతి ఈ స్టార్ హీరో.. హృతిక్ రోషన్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Hrithik Roshan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 10, 2024 | 11:00 AM

నేడు బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా హృతిక్ రోషన్ కు ఆయన అభిమానులు, పలువురు సినీ తారలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హృతిక్ రోషన్ 12 ఏళ్ల వయస్సులో తన సినీ జర్నీని ప్రారంభించాడు. రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఈ సినిమాలో అతని తండ్రి రాకేష్ రోషన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి హృతిక్ తాత జె. ఓం ప్రకాష్ దర్శకత్వం వహించారు. అనతి కాలంలోనే హృతిక్ రోషన్ స్టార్ హీరోగా ఎదిగాడు.

హృతిక్ రోషన్ ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో హృతిక్ రోషన్ భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక హృతిక్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆయన ఆస్తులు ఏకంగా రూ.3,101  కోట్లకు పైగా ఉన్నాయి. హృతిక్ రోషన్ ఒక్కో సినిమాకు 75 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఎక్కువ సినిమాలు చేయడం ఆయనకు ఇష్టం.

బ్రాండ్ ప్రమోషన్ కోసం హృతిక్ రోషన్ 10-12 కోట్లు వసూలు చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేయడానికి హృతి ఒక్కో పోస్ట్‌కు 4-5 కోట్ల రూపాయలు అందుకుంటాడు. హృతిక్ HRX బ్రాండ్‌ను ప్రారంభించాడు. షూస్, షర్ట్స్ సహా అనేక క్రీడా వస్తువులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ విలువ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. అలాగే హృతిక్ రోషన్ కు ముంబైలోని జుహులో 97.50 కోట్ల రూపాయల డూప్లెక్స్ హౌస్‌ ఉంది. అతనికి జుహులో రూ.67 కోట్ల పెంట్‌హౌస్ ఉంది. అతనికి జుహూలో రూ. 32 కోట్ల విలువైన మరో అపార్ట్‌మెంట్ ఉంది. లోనోవాలాలో 7 ఎకరాలలో ఫామ్‌హౌస్ ఉంది. దాని ధర వందల కోట్లు ఉంటుంది. అంతే కాదు హృతిక్ రోషన్ దగ్గర చాలా లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. అతని వద్ద BMW కారు ఉంది. ముస్టాంగ్, మెర్సిడెస్ అలాగే ఇతర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. హృతిక్ వ్యానిటీ వ్యాన్ ధర రూ.3 కోట్లు.ప్రస్తుతం హృతిక్ సిద్ధార్థ్ ఆనంద్  దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత వార్ 2లో నటించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ