YS Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. 21 మందితో మూడో జాబితా విడుదల.. వారికి నో టికెట్..
YSRCP in charges 3rd list: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచింది. రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా మార్పులు చేర్పులు చేస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించుతూ..
YSRCP in charges 3rd list: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచింది. రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా మార్పులు చేర్పులు చేస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించుతూ.. గ్రాఫ్ సరిగా లేని సిటింగ్‌లను పక్కన పెడుతున్నారు. సర్వే అంచనాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్.. ఇప్పటికే మొదటి విడతలో 11మంది లిస్ట్ ను విడుదల చేయగా.. 27మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే 21 మందితో మూడో జాబితాను విడుదల చేశారు. మూడోలిస్ట్ లో పలు అసెంబ్లీతోపాటు.. పార్లమెంట్ ఇన్‌ఛార్జులను ప్రకటించారు.
థర్డ్ లిస్ట్ ఇదే..
1. శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్
2. విశాఖపట్నం (ఎంపీ) – బొత్స ఝాన్సీ
3. ఏలూరు(ఎంపీ) – కారుమూరి సునీల్ కుమార్
4. విజయవాడ (ఎంపీ) – కేశినేని నాని
5. కర్నూలు (ఎంపీ) గుమ్మనూరి జయరాం
6. తిరుపతి (ఎంపీ) కోనేటి ఆదిమూలం
7. ఇచ్ఛాపురం – పిరయ విజయ
8. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
9. చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు
10. రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి
11. దర్శి – బూచేపల్లి శివప్రసాదరెడ్డి
12. పూతలపట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
13. చిత్తూరు – విజయానందరెడ్డి
14. మదనపల్లె – నిస్సార్ అహ్మద్
15. రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
16. ఆలూరు – బూసినే విరుపాక్షి
17. కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సతీష్
18. గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళి
19. సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
20. పెనమలూరు – జోగి రమేష్
21. పెడన – ఉప్పాల రాము
అయితే, శ్రీకాకుళం జడ్పీ చైర్మన్‌గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఆమె ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఉన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..